Premikudu: ప్రభుదేవా ‘ప్రేమికుడు’ మళ్లీ వస్తున్నాడు !

ప్రభుదేవా ‘ప్రేమికుడు’ మళ్లీ వస్తున్నాడు !

Premikudu: టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. ఏడాదికి ఒకటి అర సినిమాలు చేసే పెద్ద పెద్ద హీరోలు… తమ అభిమానుల్లో జోష్ నింపడానికి పాత హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ల సినిమాలను ఎక్కువగా రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో హీరోలతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రముఖ దర్శకుడు శంకర్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘ప్రేమికుడు’ సినిమాను రీ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

Premikudu Movie Updates

ప్రభుదేవా – శంకర్‌ కాంబినేషన్ లో వచ్చిన ‘ప్రేమికుడు’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిని మే 1న రీ-రిలీజ్‌ చేయనున్నట్లు నిర్మాతలు రమణ, మురళీధర్‌ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌ లో ఓ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మురళీధర్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ ‘ప్రేమికుడు’ విడుదలై 30ఏళ్లు పూర్తయ్యింది. ఇప్పుడీ సినిమాని రీ-రిలీజ్‌ చేసేందుకు అంగీకరించి మాకు సహకరిస్తున్న నిర్మాత కొంచెం మోహన్‌ కు కృతజ్ఞతలు. దీనిని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 థియేటర్లలో విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో లగడపాటి శ్రీనివాస్‌, శోభారాణి, రమణ తదితరులు పాల్గొన్నారు.

Also Read : Sudheer Babu: సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా సుధీర్ బాబు ‘హరోం హర’ రిలీజ్ !

Prabhu DevaPremikudusankar
Comments (0)
Add Comment