Preity Zinta Shocking :ఎంపీ సీటు ఆఫ‌ర్ ను తిర‌స్క‌రించా

నాకు పాలిటిక్స్ అంటే ప‌డ‌దు

Preity Zinta : సొట్ట బుగ్గ‌ల ముద్దుల గుమ్మ అంటే ఎవ‌రైనా ఇట్టే చెప్పేస్తారు. త‌ను ఎవ‌రో కాదు ప్రీతి జింతా(Preity Zinta). బాలీవుడ్ లో సూప‌ర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక టాలీవుడ్ లో మ‌హేష్ బాబుతో జ‌త క‌ట్టింది. ప‌లు సినిమాల్లో త‌ళుక్కున మెరిసింది. ప్ర‌స్తుతం వ్యాపారం చూసుకుంటోంది ఈ ముద్దుగ‌మ్మ‌. పలు విజ‌య‌వంత‌మైన సినిమాల‌లో న‌టించింది..సూప‌ర్ హీరోయిన్ గా అవార్డులు స్వంతం చేసుకుంది.

Preity Zinta Shocking Comments

తాజాగా ప్రీతి జింతా చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చింది. త‌న సినీ కెరీర్ పీక్ లో ఉన్న స‌మ‌యంలో చాలా పార్టీల నేత‌లు త‌న వ‌ద్ద‌కు వ‌చ్చార‌ని చెప్పింది. త‌న‌కు రాజ్య‌స‌భ సీటు ఇస్తామ‌ని బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాయ‌ని కానీ తాను మాత్రం వాటిని వ‌ద్దంటూ తిర‌స్క‌రించాన‌ని వెల్ల‌డించింది. ఎందుకంటే త‌న‌కు సినిమాలు, వ్యాపారం అంటేనే ఎక్కువ మ‌క్కువ అని. అనుభ‌వం లేని రాజ‌కీయాల‌లోకి వెళ్ల‌డం ఎందుక‌ని తాను వ‌ద్దంటూ త‌న‌కు ఆఫ‌ర్ చేసిన వాళ్ల ముఖం మీద‌నే చెప్పేశాన‌ని తెలిపింది.

అయితే చాలా మంది రాజ్య‌స‌భ సీటు అంటే ఎవ‌రైనా ఎగిరి గంతేస్తార‌ని కానీ త‌న‌కు స్టార్ డ‌మ్ మీద అంత‌గా ఆస‌క్తి లేద‌ని పేర్కొంది ఈ చిన్న‌ది. ప్రస్తుతం ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ కు కో ఓన‌ర్ గా ప్రీతి జింతా ఉంది. త‌న‌కు క్రికెట్ అంటే పిచ్చి. దీని మీద ఎక్కువ‌గా ఇన్వెస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ప్రీతి జింతా చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : Hero Ram-Sagar Gadi Love :’సాగ‌ర్ గాడి ల‌వ్వు’ మామూలుగా లేదుగా 

CommentsPreity ZintaShockingViral
Comments (0)
Add Comment