Preity Zinta Shocking Comments :కాంగ్రెస్ కామెంట్స్ ప్రీతి జింటా సీరియ‌స్

తీసుకున్న రుణాన్ని ఎవ‌రూ మాఫీ చేయ‌లేదు

Preity Zinta : పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ ఓన‌ర్ , బాలీవుడ్ న‌టి ప్రీతి జింతా(Preity Zinta) సీరియ‌స్ అయ్యారు. తాను తీసుకున్న అప్పు రూ. 18 కోట్ల‌ను భార‌తీయ జ‌న‌తా పార్టీ స‌ర్కార్ మాఫీ చేసిందంటూ కేర‌ళ కాంగ్రెస్ పార్టీ పేర్కొనడాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. ఆధారాలు లేకుండా ఎలా ప్ర‌చారం చేస్తారంటూ ప్ర‌శ్నించింది. ఇదేనా మీ నిబ‌ద్ద‌త‌. ఇంకొక‌రు మాఫీ చేస్తే తాము తీసుకునేందుకు సిద్దంగా లేమంటూ స్ప‌ష్టం చేశారు.

Preity Zinta Slams

ఎక్స్ వేదిక‌గా ప్రీతి జింటా సీరియ‌స్ గా స్పందించారు. ఇలాంటి వ్యాఖ్య‌ల వ‌ల్ల త‌న వ్య‌క్తిగ‌త ప‌రువుకు భంగం వాటిల్లితుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు ప్రీతి జింతా. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌ని హిత‌వు ప‌లికారు. విచిత్రం ఏమిటంటే తాను తీసుకున్న రుణానికి సంబంధించిన డ‌బ్బుల‌ను 10 సంవత్స‌రాల కింద‌టే చెల్లించ‌డం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు.

త‌న‌కు బీజేపీకి బంధం ఉంద‌ని ఎలా చెబుతారంటూ నిప్పులు చెరిగారు. ఇలాంటి చ‌వ‌క‌బారు వ్యాఖ్య‌లు మ‌రోసారి చేస్తే ప‌రువు న‌ష్టం దావా వేయాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. తాను తీసుకున్న రుణాన్ని నిర్ణీత గ‌డువు లోగా చెల్లించ‌డం జ‌రిగింద‌ని, ఎవ‌రూ మాఫీ చేయ‌లేద‌ని మ‌రోసారి పేర్కొంది ప్రీతి జింతా.
కాంగ్రెస్ నేత‌లు త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఇక‌నైనా త‌మ ప‌ని తాము చేసుకుంటే మంచిద‌ని సూచించింది సుతిమెత్త‌గా.

Also Read : Hero Pradeep Ranganathan :ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ న‌ట‌న‌కు డైరెక్ట‌ర్ ఫిదా

CommentsCongressKeralaPreity ZintaSlamsViral
Comments (0)
Add Comment