Preity Zinta Priyanka Chopra Viral : ప్రియాంక‌..ప్రీతి జింటా వైర‌ల్

జోనాస్ బ్ర‌ద‌ర్స్ సంగీత క‌చేరి

Preity Zinta Priyanka Chopra Viral : అమెరికా – యుఎస్ లో బాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు ప్రియాంక చోప్రా, ప్రీతి జింటా హ‌ల్ చ‌ల్ చేశారు. ప్రముఖ సంగీత‌కారులు జోనాస్ బ్ర‌ద‌ర్స్ సంగీత క‌చేరి చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ త‌ర‌లివ‌చ్చారు. త‌మ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కచేరికి ఇద్ద‌రు బాలీవుడ్ న‌టులు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మారారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైర‌ల్ గా మారాయి.

Preity Zinta Priyanka Chopra Viral in America

ప్రియాంక చోప్రా ఇప్ప‌టికే బాలీవుడ్ ను విడిచి హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. త‌న భ‌ర్త‌తో క‌లిసి ఇప్పుడు యుఎస్ లో ఉంటోంది. అంతే కాదు రెస్టారెంట్ కూడా న‌డుపుతోంది. తాజాగా మ్యూజిక్ క‌న్స‌ర్ట్ లో ప్రియాంక చోప్రా న‌లుగు రంగు క‌టౌట్ డ్రెస్ లో క‌ళ్లు చెదిరేలా ఆక‌ర్షించించే ప్ర‌య‌త్నం చేసింది.

ఇక ప్రీతి జింటా(Preity Zinta) అయితే పొట్టి ఎరుపు రంగు చెక్ స్క‌ర్ట్ తో బ్లాక్ టాప్ ధ‌రించింది. ప్రియాంక చోప్రా భ‌ర్త నికో జోనాస్ తో క‌లిసి వ‌చ్చింది. ప్రియాంక‌, జోనాస్ తో చేరింది ప్రీతి జింతా. వారిద్ద‌రూ సంగీత క‌చేరిని ఆస్వాదిస్తున్న ఫోటోలు ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

ప్రియాంక‌, ప్రీతి జింటా 2003లో వ‌చ్చిన ది హీరో ల‌వ్ స్టోరీ ఆఫ్ ఎస్సై మూవీలో స‌న్నీ డియోల్ స‌ర‌స‌న న‌టించారు. ఇద్ద‌రు త‌మ భ‌ర్త‌, పిల్ల‌ల‌తో యుఎస్ లోని లాస్ ఏంజిల్స్ లో స్థిర‌ప‌డ్డారు.

Also Read : Jawan Movie : బాద్ షా జ‌వాన్ వ‌సూళ్ల ఊచ‌కోత‌

Comments (0)
Add Comment