Papaya : స్త్రీకి అమ్మతనం దేవుడిచ్చిన గొప్పవరం. తన కడుపు పండిన రోజు నుంచి 9 నెలల వరకు ఆ తల్లి కడుపులోని తన బిడ్డ ఎదుగుదలకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం పండ్లు తీసుకుంటుంది. అయితే శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే పండ్లలో బొప్పాయి ఒకటి.
కానీ గర్భిణీలు బొప్పాయా తింటే గర్భస్రావం జరుగుతుందని చాలా మంది భావిస్తారు. దీంతో మహిళలు బొప్పాయాకు దూరంగా ఉంటారు.అయితే నిజంగానే బొప్పాయా తింటే గర్భం పోతుందా.. దీనిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
Papaya Uses
గర్భిణీలు పండిన బొప్పాయి తినవచ్చునంట. ఇందులో బీటా కెరాటిన్, కోలిన్ ఫైబర్, ఫోలేట్, పొటాషియం, విటమిన్ ఏ,బీ,సీ పుష్కలంగా ఉంటాయి. ఇవి గర్భిణీలకు ఎంతో మేలు చేస్తాయి. కానీ ఆకుపచ్చగా ఉన్న బొప్పాయిని గర్భిణీలు అస్సలే తీసుకోకూడదంట. ఇది చిన్న ముక్క తీసుకున్నా గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. ఎందుకంటే పచ్చి బొప్పాయిలో లేటెక్స్ అనే పదార్థం అధికంగా ఉంటం వలన పచ్చి బొప్పాయి గర్భిణీలు తీసుకోకూడదంట.
Also Read : Breakup : బ్రేకప్ తర్వాత అమ్మాయిలు ఎందుకు లావు అవుతారో తెలుసా?