Prashanth: 51 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కనున్న కోలీవుడ్ హీరో !

51 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కనున్న కోలీవుడ్ హీరో !
Prashanth: 51 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కనున్న కోలీవుడ్ హీరో !

Prashanth: కోలీవుడ్‌ హీరో ప్రశాంత్‌ రెండోసారి పెళ్లిపీటలెక్కనున్నాడు. 51 ఏళ్ల వయసున్న ఈయన త్వరలోనే మరోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ విషయాన్ని ఆయన తండ్రి, దర్శకుడు త్యాగరాజన్‌ వెల్లడించాడు. ఇటీవల అంధగన్‌ సినిమా సక్సెస్‌ మీట్‌ లో త్యాగరాజన్‌… ప్రశాంత్‌ పెళ్లి గురించి మాట్లాడాడు. వధువు గురించి వెతుకులాట మొదలుపెట్టామని, త్వరలో గుడ్‌న్యూస్‌ చెబుతామని తెలిపాడు. ఈ మాటలతో స్టేజీపై ఉన్న ప్రశాంత్‌ కాస్త సిగ్గుపడినట్లు కనిపించాడు.

Prashanth Marriage..

కాగా 2005లో ప్రశాంత్‌ కు గృహలక్ష్మి అనే మహిళతో పెళ్లి జరిగింది. కానీ ఈ బంధం ఎంతోకాలం నిలబడలేదు. 2009లో వీరు విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఈయన సింగిల్‌ గానే ఉంటున్నాడు. కెరీర్‌ పైనే పూర్తి ఫోకస్‌ పెట్టిన ప్రశాంత్‌ ఇన్నాళ్లకు మళ్లీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు.

ఇక ప్రశాంత్ సినిమాల విషయానికి వస్తే… ఈయన తెలుగులో లాఠి, ప్రేమ శిఖరం, తొలి ముద్దు చిత్రాల్లోనూ నటించాడు. వినయ విధేయ రామలో కీలక పాత్రలో మెప్పించాడు. ఇటీవలే అంధగన్‌ లో హీరోగా నటించిన ఈయన ప్రస్తుతం గోట్‌ సినిమా చేస్తున్నాడు. ఇందులో విజయ్‌ స్నేహితుడిగా కనిపించనున్నాడు.

Also Read : Rajinikanth Movie : తలైవా ‘వేట్టైయాన్’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్

AndhaganKollywoodPrashanth
Comments (0)
Add Comment