Jr NTR : తెరపై భావోద్వేగాలను పలికించడంలో తనకు తనే సాటి జూనియర్ ఎన్టీఆర్(Jr NTR). ఇది తన తాత సీనియర్ ఎన్టీఆర్ నుంచి వచ్చింది. ప్రస్తుతం రెండు చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు తారక్. ఓ వైపు బాలీవుడ్ లో తొలిసారిగా డైరెక్టర్ హిందీ మూవీ వార్ -2లో స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తుండగా మరో వైపు పాన్ ఇండియా డైరెక్టర్ కేజీఎఫ్, సలార్ చిత్రాల సృష్టికర్త ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో బిజీగా మారి పోయాడు. ప్రధానంగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Jr NTR-Prashant Neel
డ్రాగన్ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ , టీజర్ ఇప్పటికే విడుదల చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. హీరో, హీరోయిన్ల కంటే కథకే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాడు తను. తనకు కావాల్సిన సన్నివేశాలకు సరిగ్గా అతుక్కు పోయి, ప్రాణం పోసే నటులనే తను ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంటాడు. అలాంటి వారిలో ప్రభాస్ తర్వాత జూనియర్ ఎన్టీఆరేనని ఆయన నమ్మకం.
ఇప్పుడు ఇద్దరూ కలిసి బ్లాక్ బస్టర్ మూవీ తీయడంలో దృష్టి సారించారు. కర్ణాటక, ఇతర ప్రాంతాలలో షూటింగ్ మొదలు పెట్టారు. ఎస్ఎస్ రాజమౌళి కానీ, ప్రశాంత్ నీల్ కానీ తమ సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ ఇవ్వరు. తమ పని తాము చేసుకుంటూ పోతారు. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించి భారీ ఎత్తున బడ్జెట్ తో నిర్మిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్స్ ఇచ్చారు నిర్మాత రవి శంకర్. డ్రాగన్ పేరు మార్చే ప్రసక్తి లేదన్నాడు. ప్రదీప్ రంగనాథన్ నటించిన చిత్రం డ్రాగన్ చిన్న జోనర్ అని, కానీ తారక్ నటించే ఈ మూవీ మాత్రం వరల్డ్ వైడ్ గా పిచ్చెక్కించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దీంతో ఈ మూవీపై మరింత అంచనాలు పెరిగేలా చేశాయి.
Also Read : Beauty Sreeleela-Karthi : శ్రీలీల..కార్తీక్ ఆర్యన్ డ్యాన్స్ వైరల్