Prashant Neel : అంద‌రి క‌ళ్లు ప్ర‌శాంత్ నీల్ పైనే

స‌లార్ అంచ‌నాలు అందుకుంటుందా

ఒకే ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా వైర‌ల్ గా మారాడు క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌శాంత్ నీల్. త‌ను ప్ర‌స్తుతం డార్లింగ్ ప్ర‌భాస్ తో తీసిన స‌లార్ చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇందులో ప్ర‌భాస్ తో పాటు శ్రుతీ హాస‌న్ న‌టించారు. ఇక ప్ర‌తి నాయ‌కుడిగా బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ న‌టిస్తున్నాడు.

ఇప్ప‌టికే ముంద‌స్తు టికెట్ల అమ్మ‌కాల‌లో రికార్డు బ్రేక్ చేసింది. ఇక ప్ర‌శాంత్ నీల్ య‌శ్ తో తీసిన కేజీఎఫ్ , కేజీఎఫ్ 2 చిత్రాలు దుమ్ము రేపాయి. టేకింగ్, మేకింగ్ కు జ‌నం ఫిదా అయ్యారు. ప్ర‌తి స‌న్నివేశాన్ని ఆలోచింప చేసేలా, ఆక‌ట్టుకునేలా తీయ‌డంలో బిగ్ స‌క్సెస్ అయ్యాడు ద‌ర్శ‌కుడు నీల్.

ఆయ‌న ఎవ‌రో కాదు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నీల‌కంఠాపురం ర‌ఘువీరా రెడ్డికి వ‌రుస‌కు కొడుకు అవుతాడు. ఆయ‌న త‌మ్ముడి త‌న‌యుడే ఈ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికీ త‌ను లో ప్రొఫైల్ మెయింటెనెన్స్ చేస్తాడు.

తార‌క్ తో త్వ‌ర‌లో సినిమా తీయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు ప్ర‌శాంత్ నీల్. ఎక్కువ‌గా మాట్లాడేందుకు ఇష్ట ప‌డ‌ని ఈ ద‌ర్శ‌కుడు ఏది మాట్లాడినా అదో ఆణిముత్య‌మే.

Comments (0)
Add Comment