Thalapathy Vijay : తమిళనాడు – ప్రముఖ రాజకీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలనంగా మారారు. తను తమిళనాడులో ప్రత్యక్షం అయ్యారు. తమిళ సినీ సూపర్ స్టార్ దళపతి విజయ్(Thalapathy Vijay) తో భేటీ అయ్యారు. కీలక అంశాలపై వీరిద్దరూ చర్చించారు. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి సపోర్ట్ చేయాల్సిందిగా విజయ్ కోరినట్లు సమాచారం.
Thalapathy Vijay Meet Prashant Kishor
ఇవాళ మహాబలిపురం వేదికగా టీవీకే పార్టీ తొలి వార్షికోత్సవం జరిగింది. ఈ కీలక మీటింగ్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు పీకే. ఆయన బీహార్ లో స్వంత పార్టీ పెట్టారు. కొంత కాలం పాటు సర్వేలకు దూరంగా ఉంటానని ప్రకటించాడు. కానీ ఉన్నట్టుండి మనసు మార్చుకున్నాడు.
ఎవరూ ఊహించని విధంగా దళపతి విజయ్ పార్టీని ప్రకటించాడు. తాను నిర్వహించిన తొలి సభకు 10 లక్షల మందికి పైగా హాజరు కావడం తమిళనాట కలకలం రేపింది. రాజకీయాలలో పెను ప్రకంపనలు సృష్టిస్తూ వచ్చింది. తెలంగాణలో బీఆర్ఎస్ కు, బెంగాల్ లో టీఎంసీకి, ఏపీలో జగన్ రెడ్డికి గతంలో ప్రశాంత్ కిషోర్ తో పాటు తన టీం పని చేసింది.
ఇదే సమయంలో పలుమార్లు దళపతి విజయ్ హైదరాబాద్ లో మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు. వీరిద్దరి మధ్య రాజకీయ చర్చలు జరిగినట్లు టాక్. గతంలో తమిళనాడులో డీఎంకే పవర్ లోకి రావడంలో కీలక పాత్ర పోషించాడు పీకే. ఇప్పుడు స్టాలిన్ ను కాకుండా విజయ్ పక్కన చేరాడు. తన ప్లాన్ వర్కవుట్ అవుతుందా అనేది వేచి చూడాలి. ఇప్పటికే తన ప్లాన్ట్స్ ను అన్నింటిని ప్రజల మధ్యకు తీసుకు వెళ్లేందుకు రంగం సిద్దం చేశాడు.
Also Read : Preity Zinta Shocking Comments :కాంగ్రెస్ కామెంట్స్ ప్రీతి జింటా సీరియస్