Prashant Kishor Shocking :ద‌ళ‌ప‌తిని సీఎం చేసేంత దాకా నిద్ర‌పోను

రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ కామెంట్స్

Prashant Kishor : త‌మిళ‌నాడు – టీవీకే పార్టీ చీఫ్ , త‌మిళ సినీ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ , జ‌న సుర‌క్ష పార్టీ చీఫ్ ప్ర‌శాంత్ కిషోర్(Prashant Kishor). త‌న‌ను త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి చేసేంత వ‌ర‌కు నిద్ర పోనంటూ శ‌ప‌థం చేశారు.

Prashant Kishor Shocking Comments

బుధ‌వారం త‌మిళ‌నాడు లోని మ‌హా బ‌లిపురంలో టీవీకే పార్టీ స్థాపించి ఏడాదైన సంద‌ర్బంగా మ‌హానాడు చేప‌ట్టారు. భారీ ఎత్తున శ్రేణులు హాజ‌ర‌య్యాయి. ఈ సంద‌ర్బంగా ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌సంగించారు.

త‌మిళ‌నాడులో 2026లో జ‌రిగే ఎన్నిక‌లు కీల‌కంగా మార బోతున్నాయ‌ని అన్నారు. తాను అన్ని అస్త్రాలు ప్ర‌యోగిస్తాన‌ని, విజ‌య్ ని సీఎం చేయ‌డ‌మే త‌న ముందున్న ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌శాంత్ కిషోర్. తన ఆలోచ‌న‌లు, కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేయ‌డంపై ప్ర‌స్తుతం ఫోక‌స్ పెట్టాన‌ని తెలిపారు.

గ‌తంలో త‌మిళ‌నాడులో డీఎంకే పార్టీని ప‌వ‌ర్ లోకి తీసుకు వ‌చ్చాన‌ని, కానీ ఈసారి స్టాలిన్ ను అధికారానికి దూరం చేస్తాన‌ని టీవీకేకు భారీ విజ‌యాన్ని క‌ట్ట‌బెడ‌తాన‌ని వెల్ల‌డించారు పీకే. తొలిసారిగా డైరెక్ట్ గా అటాకింగ్ మొద‌లు పెట్టారు ప్ర‌శాంత్ కిషోర్. తాజాగా ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : Hero Ajith-Vidaamuyarchi OTT :నెట్ ఫ్లిక్స్ లో అజిత్ ‘విదాముయార్చి’

CommentsPrashant KishorShockingThalapathy VijayViral
Comments (0)
Add Comment