Prasanna Vadanam: ఓటీటీలోనికి ‘ప్రసన్నవదనం’ !

ఓటీటీలోనికి ‘ప్రసన్నవదనం’ !

Prasanna Vadanam: కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్, ప్రసన్న వదనం(Prasanna Vadanam) ఇలా విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలను అందుకుంటున్న టాలీవుడ్ యువ నటుడు సుహాస్‌. ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ సమస్యతో బాధపడే వ్యక్తిగా ఆయన నటించిన తాజా సినిమా ‘ప్రసన్నవదనం’. పాయల్‌ రాధాకృష్ణ, రాశీసింగ్‌ ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన అర్జున్‌ వైకే దర్శకత్వం వహించారు. ఈనెల 3న థియేటర్లలో విడుదలై బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫాం ‘ఆహా’ లో ఈనెల 24 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ‘ఆహా గోల్డ్‌’ సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవారికి 24 గంటల ముందే అందుబాటులో ఉండనుంది.

Prasanna Vadanam – క‌థేమిటంటే ?

సూర్య (సుహాస్‌) రేడియో జాకీగా పని చేస్తుంటాడు. ఓ ప్ర‌మాదం అత‌డి జీవితాన్ని త‌లకిందులు చేస్తుంది. అమ్మానాన్న‌ల్ని కోల్పోవ‌డంతోపాటు… ఫేస్ బ్లైండ్‌నెస్‌ (ప్రోసోపాగ్నోసియా) స‌మ‌స్య బారిన ప‌డతాడు. ఎవ‌రినీ గుర్తు ప‌ట్ట‌లేని పరిస్థితి. వాయిస్‌నీ గుర్తించ‌లేడు. త‌న స్నేహితుడు విఘ్నేష్ (వైవా హ‌ర్ష‌)కి త‌ప్ప తన సమస్య ఎవరికీ తెలియకుండా జాగ్ర‌త్తలు తీసుకుంటూ కాలం గ‌డుపుతుంటాడు. ఆద్య (పాయల్‌)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఇంత‌లోనే త‌న క‌ళ్ల ముందు ఓ హ‌త్య జ‌రుగుతుంది. త‌న‌కున్న స‌మ‌స్య‌తో ఆ హ‌త్య ఎవ‌రు చేశారో తెలుసుకోలేడు.

కానీ, పోలీసుల‌కి ఈ విష‌యం తెలిపేందుకు ప్ర‌య‌త్నిస్తాడు. ఆ వెంట‌నే అత‌నిపై దాడి జ‌రుగుతుంది. అయినా వెన‌క‌డుగు వేయ‌ని సూర్య… ఏసీపీ వైదేహి (రాశిసింగ్‌) ద‌గ్గ‌రికి వెళ్లి జ‌రిగిన విష‌యం చెబుతాడు. త‌నకున్న స‌మ‌స్య‌నీ వివ‌రిస్తాడు. అనూహ్యంగా ఆ హ‌త్య కేసులో సూర్య‌నే ఇరుక్కోవాల్సి వ‌స్తుంది. ఇంత‌కీ ఆ హ‌త్య ఎవ‌రు చేశారు? హ‌త్య‌కి గురైన అమ్మాయి ఎవ‌రు? ఆ కేసులో సూర్య‌ని ఇరికించింది ఎవ‌రు? అస‌లు నిందితులు ఎప్పుడు, ఎలా బ‌య‌టికొచ్చారు? సుహాస్ ప్రేమ‌క‌థ ఏ తీరానికి చేరింది? అన్నది మిగతా కథ. ఈ కథను దర్శకుడు అర్జున్ వైకే అద్భుతంగా తెరపైకి ఎక్కించారు.

Also Read : Serial Actor Chandu: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య !

ahaPrasanna VadanamSuhas
Comments (0)
Add Comment