Pranitha: దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన తిరుమల లడ్డూ వివాదంపై నటి ప్రణీత(Pranitha) స్పందించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను తరచూ సామాజిక మాధ్యమాల్లో పంచుకునే ప్రణీత తాజాగా తిరుమల లడ్డూపై వస్తోన్న వార్తలు భక్తులు ఊహించలేనివి అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘శ్రీవారి లడ్డూ తయారీలో జంతు కొవ్వు వినియోగించడం దారుణం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా. ఇది శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు కలలో కూడా ఊహించనిది’ అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా పలువురు నెటిజన్లు దీనిపై స్పందిస్తున్నారు. ఈ వివాదంపై మొదటిగా స్పందించినందుకు ఆమెను అభినందిస్తున్నారు.
Pranitha Comment
మరోవైపు తిరుమల శ్రీవారి లడ్డూ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. తిరుమల, తిరుపతి దేవస్థానం మహాప్రసాదమైన లడ్డూల తయారీలో పెద్దఎత్తున కల్తీ జరిగిందని, అందులో పాలతో పాటు ఫిష్ ఆయిల్, యానిమల్ ఫ్యాట్, లార్డ్ (పంది కొవ్వు) అవశేషాలు ఉన్నట్లు గుజరాత్ కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) కాఫ్ లిమిటెడ్ సంస్థ అనుమానం వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూ వివాదం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది.
Also Read : Sobhita Dhulipala: అంతర్జాతీయ అవార్డుల బరిలో అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ్ల సిరీస్ !