Praneeth Hanumanthu: కాంట్రవర్సీ కంటెంట్ క్రియేటర్ గా మారిన ఐఏఎస్ కొడుకు !

కాంట్రవర్సీ కంటెంట్ క్రియేటర్ గా మారిన ఐఏఎస్ కొడుకు !

Praneeth Hanumanthu: గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు ప్రణీత్‌ హనుమంతు. యూట్యూబ్‌ కంటెంట్‌ క్రియేటర్‌ గా కొంత మంది ప్రేక్షకులకు పరిచయం అయిన ప్రణీత్(Praneeth Hanumanthu)… ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు కూడా అందుకుంటున్నాడు. యూట్యూబ్‌ వేదికగా రోస్ట్‌ వీడియోస్‌ చేస్తూ ప్రణీత్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అమెరికాలో నివసించే ఓ తెలుగు ఫ్యామిలీ షేర్‌ చేసిన రీల్‌ మీద తండ్రీ కుమార్తె బంధాన్ని అపహాస్యం చేస్తూ… ప్రణీత్‌ హనుమంతు జోక్స్‌ వేశాడు. అతడి స్నేహితులు ఇంకో అడుగు ముందుకేసి నీచమైన కామెంట్స్‌ చేశారు.

Praneeth Hanumanthu…..

దీనితో అతడి వ్యాఖ్యల పట్ల ప్రజలు నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో హీరో సాయిధరమ్‌ తేజ్‌ మొదటిగా స్పందించి అతని మీద చర్యలు తీసుకోవాలని తెలుగ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, పోలీస్‌ ఉన్నతాధికారులకు రిక్వెస్ట్‌ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ – తెలంగాణ డీజీపీలు దీనిపై స్పందించారు. సాయిధరమ్‌తేజ్‌తోపాటు మంచు మనోజ్‌, నారా రోహిత్‌, విశ్వక్‌ సేన్, నిర్మాత అహితేజ బెల్లంకొండ సైతం ప్రణీత్‌ హనుమంతు వ్యాఖ్యలను ఖండించారు. అతడి మీద చర్య తీసుకోవాలని కోరారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

దీనితో ప్రణీత్(Praneeth Hanumanthu) పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవడానికి నెటిజన్లు ఆశక్తి చూపుతూ… అతని వివరాలు కోసం తీవ్రంగా నెట్టింట జల్లెడ పడుతున్నారు. గూగుల్ తల్లి ఇచ్చిన సమాచారం చూసి… నెటిజన్లు అవాక్కవుతున్నారు. దీనికి కారణం ప్రణీత్ తండ్రి ఓ ఐఏఎస్ అధికారి కావడమేనట. ప్రణీత్‌ హనుమంతు తండ్రి పేరు హెచ్‌. అరుణ్‌ కుమార్‌. ఆయనొక ఐఏఎస్‌ అధికారి. 2004 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అని, మొన్నటి వరకు ఏపీలో సివిల్‌ సప్లయిస్‌ అండ్‌ ఈవో సెక్రటరీగా విధులు నిర్వహించారని సమాచారం. ప్రణీత్‌ హనుమంతు అన్నయ్య కూడా యూట్యూబర్‌. అతను స్టైలింగ్‌ టిప్స్‌ ఇస్తూ ఫేమ్‌ తెచ్చుకున్నాడు. ‘ఏ జూడ్‌’ చానల్‌లో అతను కనిపిస్తుంటాడు. ఇక ప్రణీత్ సుధీర్‌ బాబు కథానాయకుడిగా వచ్చిన లేటెస్ట్‌ మూవీ ‘హరోం హర’లో నటించాడు. తమిళనాడు ప్రాంతానికి చెందిన డాన్‌ తరహా పాత్ర పోషించాడు.

‘హరోం హర’ కంటే ముందు ఆహా ఓటీటీలో విడుదల అయిన ఒరిజినల్‌ ఫిల్మ్‌ ‘మై డియర్‌ దొంగ’లో ఫ్రాంక్‌ స్టార్‌గా కనిపించాడు. ‘కీడా కోలా’ విడుదలకు ముందు దర్శక నటుడు తరుణ్‌ భాస్కర్‌ చేసిన ప్రమోషనల్‌ వీడియోలో కామెడీ కింగ్‌ బ్రహ్మానందం గెటప్స్‌ రీ క్రియేట్‌ చేశారు. ఆ వీడియో వెనుక సృష్టికర్త ప్రణీత్‌ హనుమంతే(Praneeth Hanumanthu). అతను కొన్ని సినిమాల విడుదలకు ముందు ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలు చేశాడు. ‘హాయ్‌ నాన్న’ విడుదలకు ముందు నానితో, ‘భజే వాయు వేగం’ విడుదల సమయంలో కార్తికేయ గుమ్మకొండతో ప్రణీత్‌ హనుమంతు స్పెషల్‌ వీడియోలు చేశాడు. హ్యూమర్‌ కోసం అతడి వీడియోస్‌ చూసే కొందరు ఆడియన్స్‌ సైతం తండ్రీ కుమార్తె బంధం మీద చేసిన వీడియో మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి ఫ్యామిలీ మీద కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రణీత్‌ హనుమంతు క్షమాపణలు కోరుతూ ఓ వీడియో విడుదల చేశారు. అందులో తనను తాను సమర్థించుకుంటూ డార్క్‌ హ్యూమర్‌ అని పేర్కొనడం పట్ల మరింత ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

Also Read : Tanya Ravichandran: సెన్సార్ పూర్తి చేసుకున్న తాన్య రవిచంద్రన్‌‘రెక్కై ములైత్తేన్‌’ !

Manchu ManojPraneeth HanumanthuSai Dharam Tej
Comments (0)
Add Comment