Prakash Raj Shocking :హిందీ భాష‌ను వ‌ద్దంటే దేశ ద్రోహులు కాదు

ప‌వన్ క‌ళ్యాణ్ కామెంట్స్ ప్ర‌కాశ్ రాజ్ సీరియ‌స్

Prakash Raj : ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. కాకినాడ స‌భ వేదిక‌గా జ‌రిగిన జ‌న‌సేన పార్టీ జ‌య‌కేత‌నం స‌భా వేదిక‌గా ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు స‌రికాద‌ని పేర్కొన్నారు. ఈ దేశానికి బ‌హు భాష‌లు అవ‌స‌ర‌మ‌ని చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.

Prakash Raj Shocking Comments

ప్ర‌జ‌ల మ‌ధ్య కులం పేరుతో, మ‌తంపేరు విద్వేషాల‌ను రాజేసి రాజ‌కీయ ప‌బ్బం గడుపుతున్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి వంత పాడుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ప్ర‌జ‌లు క్షమించ‌ర‌ని అన్నారు. ఇదే స‌మ‌యంలో ఒక భాష‌ను వ‌ద్ద‌ని అనే హ‌క్కు ఆ ప్రాంత‌పు ప్ర‌జ‌ల‌కు ఉంటుంద‌న్నారు. ఇది ఫెడ‌ర‌ల్ వ్య‌వ‌స్థ అని తెలుసుకుంటే మంచిద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు హిత‌వు ప‌లికారు ప్ర‌కాశ్ రాజ్(Prakash Raj).

హిందీ భాష‌ను కేంద్ర ప్ర‌భుత్వం, మోదీ అమిత్ షా ప‌రివారం బ‌ల‌వంతంగా రుద్దే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని, దీనిని ప్ర‌తి ఒక్క‌రు ఖండించాల‌ని పిలుపునిచ్చారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఎవ‌రికీ తెలియ‌ద‌న్నారు. ఒక‌నాడు చెగువేరా అన్నాడ‌ని ఇప్పుడు మోదీ జ‌పం చేస్తున్నాడ‌ని ఎద్దేవా చేశారు.

హిందీ భాష‌ను వ‌ద్దంటే దేశ ద్రోహం అవుతుందా అని ప్ర‌శ్నించారు ప్ర‌కాశ్ రాజ్. త‌మిళ‌నాడు ప్ర‌జ‌లే కాదు ఏ రాష్ట్ర ప్ర‌జ‌లు కేంద్ర నిర్ణ‌యాన్ని ఒప్పుకోర‌ని స్ప‌ష్టం చేశారు. ఇక‌నైనా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆచి తూచి మాట్లాడితే మంచిద‌ని హిత‌వు ప‌లికారు.

Also Read : Kangana Emergency : నెట్ ఫ్లిక్స్ లో కంగనా ఎమ‌ర్జెన్సీ స్ట్రీమింగ్

Commentspawan kalyanPrakash RajViral
Comments (0)
Add Comment