Prakash Raj : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాష్ రాజ్

ఈ క్రమంలో నటుడు ప్రకాష్ రాజ్ పై మండిపడ్డారు. లడ్డు అపచారం జరిగిందని మేము మాట్లాడుతుంటే....

Prakash Raj : తిరుమల లడ్డు వివాదం రోజు రోజుకు ముదురుతోంది. లడ్డు వివాదం పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ అయ్యిందంటూ ఈ దీక్ష చేపట్టారు పవన్. ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో ప్రత్యేక పూజలు చేసి దీక్షకు దిగారు. అంతకు ముందు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. 11 రోజుల దీక్ష అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు పవన్. తాజాగా విజయవాడ కనకదుర్గ ఆలయం మెట్లను శుభ్రం చేశారు పవన్. కాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ. కొందరు లడ్డు అపచారం పై పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్.

Prakash Raj Tweet

ఈ క్రమంలో నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) పై మండిపడ్డారు. లడ్డు అపచారం జరిగిందని మేము మాట్లాడుతుంటే.. ప్రకాష్ రాజ్ ఎందుకు మాట్లాడుతున్నారు.? ఆయన ఏం సంబంధం.? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు పవన్. నేను ఇంకో మతాన్ని నిందించానా.? దీని గురించి మాట్లాడుతుంటే .. మాట్లాడొద్దు అని అంటున్నారు. తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా.? అని పవన్ ఫైర్ అయ్యారు. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఆలాగే ఓ ట్వీట్ కూడా చేశారు. పవన్‌ నా వ్యాఖ్యలను పవన్‌ అపార్థం చేసుకున్నారు. నేను ఒకటి చెబితే మీరు మరోలా అర్థం చేసుకున్నారు. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నా..ఈ నెల 30 తర్వాత వచ్చి మీరు అన్న ప్రతి మాటకు సమాధానం చెబుతా.. మీకు వీలైతే నా ట్వీట్‌ను మళ్లీ చదివి అర్థం చేసుకోండి అని ప్రకాష్ రాజ్ ఓ వీడియోను విడుదల చేశారు.

Also Read : Mathu Vadalara 2 : ఓటీటీకి సిద్దమవుతున్న కీరవాణి తనయుడి సినిమా ‘మత్తు వదలరా 2’

AP Deputy CM Pawan KalyanCommentsPrakash RajTirumala Tirupathi DevastanamViral
Comments (0)
Add Comment