Prakash Raj Jai Bhim : గాంధీని చంపినోళ్లు అవార్డు ఇస్తారా

న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్

Prakash Raj Jai Bhim : మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ప్ర‌ముఖ న‌టుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj). దేశ విముక్తి కోసం ప్ర‌య‌త్నం చేసిన మ‌హాత్మా గాంధీని చంపిన వాళ్లు భార‌త రాజ్యాంగాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించే ప‌నిలో ఉన్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇదే అంబేద్క‌ర్ ను ఆద‌ర్శంగా తీసుకుని త‌న తీర్పుల‌తో చ‌రిత్ర సృష్టించిన జ‌డ్జి జీవిత క‌థ ఆధారంగా తీసిన జై భీమ్ సినిమాకు ఎలా అవార్డు ఇస్తార‌ని అనుకున్నారంటూ ప్ర‌శ్నించారు.

Prakash Raj Jai Bhim Asking

ప్ర‌కాశ్ రాజ్ లేవ‌దీసిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల్సింది ఎవ‌రు అన్న‌ది ఆలోచించాలి. ఆయ‌న త‌న వాయిస్ ను మోదీకి, భార‌తీయ జ‌న‌తా పార్టీకి, దాని అనుబంధ సంస్థ‌ల‌కు వ్య‌తిరేకంగా వినిపిస్తూనే ఉన్నారు. మోదీ కొలువు తీరిన త‌ర్వాత ఈ దేశంలో దాడులు ఎక్కువ‌య్యాయ‌ని, మ‌తం పేరుతో మార‌ణ హోమం కొన‌సాగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

తాజాగా జాతీయ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది కేంద్ర స‌ర్కార్ . ఇందులో త‌మిళ సినీ రంగానికి చెందిన ప‌లు సినిమాలు అద్భుతంగా ఆడాయి. కొన్ని విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాయి. వాటిలో జై భీమ్ ఒక‌టి. యావ‌త్ దేశ‌మే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ఆ సినిమాను పెద్ద ఎత్తున ఆద‌రించారు. అయినా జాతీయ అవార్డుల‌లో చోటు ద‌క్క‌లేదు.

దీనిపై న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. జై భీమ్ గొప్ప సినిమా అని అవార్డు రాక పోయినా స‌మాజంలో ఎల్ల‌ప్ప‌టికీ ఉంటుంద‌ని పేర్కొన్నారు.

Also Read : Salaar Movie : అమెరికాలో స‌లార్ హ‌ల్ చ‌ల్

prakash raj jai bhim national awards
Comments (0)
Add Comment