Pragya Jaiswal: ‘మిర్చిలాంటికుర్రోడు’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ‘కంచె’ సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నటి ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal). ఈ సినిమాలో ప్రగ్యా నటనకు… డెబ్యూ హీరోయిన్ గా అవార్డుల పంట పండింది. ఆ తరువాత అఖండ సినిమాలో బాలయ్యబాబు సరసన నటించి… తన అందం, అభినయంతో మంచి విజయాన్ని అందుకుంది. 2014లో కోలీవుడ్ లో ‘విరాట్టు’… హిందీలో ‘టిటూ ఎంబిఏ’ సినిమాలతో ఒకేసారి ఎంట్రీ ఇచ్చిన ఈ మధ్యప్రదేశ్ భామకు… అక్కడ కూడా చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. దీనితో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవడానికి సిద్ధమైంది ప్రగ్యా.
Pragya Jaiswal Got Offer from Bollywood
సరిగ్గా పదేళ్ళ తరువాత తన డెబ్యూ ఇండస్ట్రీ బాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తోంది. అక్షయ్ కుమార్, తాప్సి, వాణీ కపూర్ తదితరులు నటిస్తున్న ‘ఖేల్ ఖేల్ మే’ సినిమాలో ప్రస్తుతం ఈమె నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటాలీయన్ సినిమా రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను ముదస్సర్ అజీజ్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఉదయ్ పూర్ లో షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాలో ప్రగ్యా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే బాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించిన ఈ ఎంపీ బ్యూటీకు ఈ సారైనా బ్రేక్ వస్తుందా… లేక టాలీవుడ్ కే పరిమితం అవుతుందా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.
Also Read : Yashraj Mukhate: రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు !