Prabhu Deva: తన డ్యాన్స్ తో కుర్రకారుని ఉర్రూతలూగించే ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా… హీరోగా, దర్శకుడిగా కూడా పాన్ ఇండియాలో మంచి గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో ప్రభుదేవా నటన, డ్యాన్స్, దర్శకత్వంకు అభిమానులు ఫిదా అవుతారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న ఆయన.. .మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారు. జేఎమ్ రాజా తెరకెక్కిస్తున్న ‘సింగనల్లూర్ సిగ్నల్’ అనే చిత్రంలో ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ఇటీవల లాంఛనంగా షూటింగ్ ను ప్రారంభించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం.
Prabhu Deva…
ఈ సినిమాలో ప్రభుదేవా… ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా సరికొత్త పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రభుదేవా సరసన ‘జో’ ఫేమ్ భవ్య త్రిఖ నటిస్తుంది. ఏజే ప్రభాకరన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నారు. నటన, డ్యాన్స్ రెండింటి మేళవింపుగా ‘మూన్‌వాక్’ అనే సినిమాను ఇటీవలే ప్రారంభించారు ప్రభుదేవా. ఆ సినిమాకు మనోజ్ ఎన్‌ఎస్ దర్శకత్వం వహిస్తూ… దివ్యా మనోజ్, ప్రవీణ్ ఏలక్ లతో కలిసి నిర్మిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే మొదటి షెడ్యూల్‌ని పూర్తిచేసుకున్న ఆ సినిమా టైటిల్ ని చిత్ర యూనిట్ కొద్ది రోజుల క్రితం ప్రకటించింది.
Also Read : The India House: రామ్ చరణ్ నిర్మాతగా నిఖిల్ పాన్ ఇండియా సినిమా ‘ది ఇండియా హౌస్’ !