Prabhu Deva: ప్రభుదేవా ‘మూన్‌వాక్‌’ సినిమా ప్రారంభం !

ప్రభుదేవా ‘మూన్‌వాక్‌’ సినిమా ప్రారంభం !

Prabhu Deva: తన డ్యాన్స్ తో కుర్రకారుని ఉర్రూతలూగించే ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా… హీరోగా, దర్శకుడిగా కూడా పాన్ ఇండియాలో మంచి గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో నటన, డ్యాన్స్ రెండింటి మేళవింపుగా ఓ కొత్త చిత్రంతో ఈ ప్రేక్షకులను అలరించడానికి రంగం సిద్ధం చేశారు ప్రభుదేవా. ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆ చిత్రాన్ని మనోజ్‌ ఎన్‌ఎస్‌ దర్శకత్వం వహిస్తూ… దివ్యా మనోజ్, ప్రవీణ్‌ ఏలక్‌ లతో కలిసి నిర్మిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే మొదటి షెడ్యూల్‌ని పూర్తిచేసుకున్న ఆ సినిమా టైటిల్‌ ని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ సినిమాకి ‘మూన్‌ వాక్‌’ అనే పేరును ఖరారు చేస్తూ కొత్త పోస్టర్‌ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ మూన్ వాక్ సినిమా పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Prabhu Deva Movies Update

డ్యాన్స్‌ ఎలిమెంట్స్‌ మాత్రమే కాకుండా, కుటుంబ భావోద్వేగాలు కూడా ఇందులో కీలకమని తెలిపింది చిత్ర యూనిట్. ప్రభుదేవా హీరోగా వచ్చిన ఎన్నో పాటలకు విజయవంతమైన సంగీతాన్ని అందించిన ఏఆర్‌ రెహమాన్‌ ఈ సినిమాకీ బాణీలు అందించనున్నారు. వీరిద్దరి కలయికలో రానున్న ఆరవ చిత్రమిది. యోగిబాబు, అర్జున్‌ అశోకన్, దీపా శంకర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

Also Read : Megastar Chiranjeevi: ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రికు మెగాస్టార్‌ చిరంజీవి సన్మానం !

AR RahmanMoon WalkPrabhu Deva
Comments (0)
Add Comment