Prabhu Deva: ప్రభుదేవా ఇంట తీవ్ర విషాదం !

ప్రభుదేవా ఇంట తీవ్ర విషాదం !

Prabhu Deva: ప్రముఖ కొరియోగ్రాఫర్‌, నటుడు, దర్శకుడు ప్రభుదేవా కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రభుదేవా అమ్మమ్మ ‘పుట్టమ్మన్ని’ (97) అనారోగ్యంతో కన్నుమూశారు. దీనితో ఆయన వెంటనే మైసూరు చేరుకున్నారు. కర్నాటకలోని మైసూర్‌లో జన్మించిన ప్రభుదేవా చైన్నైలో నివాసం ఉంటున్నారు.

Prabhu Deva….

ప్రభుదేవా అమ్మమ్మ మరణించడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మైసూర్‌లోని మందకల్లి విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా తన సొంత గ్రామం ‘తొరు’ చేరుకున్నారు. బుధవారం నిర్వహించిన అంత్యక్రియల్లో ప్రభుదేవా తమ్ముళ్ళు రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్‌ లు కూడా పాల్గొన్నారు. పుట్టమ్మన్ని మరణంతో ప్రభుదేవా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Also Read:Thangalaan: ఆశక్తికరంగా విక్రమ్‌ ‘తంగలాన్‌’ ట్రైలర్‌ !

GrandmotherIndian DancerPrabhu Deva
Comments (0)
Add Comment