Hero Prabhas Salaar 1:ప్ర‌భాస్ స‌లార్ రీ రిలీజ్ డేట్ ఫిక్స్

మార్చి 21న ప్రేక్ష‌కుల ముందుకు

Salaar : పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన స‌లార్(Salaar) తిరిగి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే ఈ మూవీ రికార్డు సృష్టించింది. భార‌త దేశ వ్యాప్తంగా ఇది సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. భారీ వ‌సూళ్ల‌ను సాధించిన సినిమాగా నిలిచింది. మేకింగ్, టేకింగ్ లో త‌న‌దైన ముద్ర క‌న‌బ‌ర్చిన ప్ర‌శాంత్ నీల్ ప్ర‌భాస్ ను డిఫ‌రెంట్ గా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు.

Salaar Re-Release Updates

త‌ను క‌న్న‌డ స్టార్ య‌శ్ తో తీసిన కేజీఎఫ్ సూపర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. ఒక్క ఊపు ఊపేసింది. ప్ర‌స్తుతం త‌ను జూనియ‌ర్ ఎన్టీఆర్ తో సినిమా తీసేందుకు రెడీ అయ్యాడు. ఈ త‌రుణంలో ప్ర‌భాస్ కీల‌క పాత్ర‌లో న‌టించిన స‌లార్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు ముందుకు రానుంద‌ని ప్ర‌క‌టించారు మూవీ మేక‌ర్స్. ఈ మేర‌కు కీల‌క అప్ డేట్ కూడా ఇచ్చేశారు.

దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఖుషీకి లోన‌వుతున్నారు. త‌మ ఆరాధ్య దైవంగా భావించే ప్ర‌భాస్ న‌టించిన సినిమా చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇదిలా ఉండ‌గా వ‌చ్చే నెల మార్చి 21న పునః విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు.

స‌లార్ అన్ని భాష‌ల‌లో విడుదలైంది. రిలీజైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకు పోయింది. దీంతో ప్ర‌శాంత్ నీల్ పై మ‌రింత బాధ్య‌త‌, ఒత్తిడి కూడా పెరిగింది. కానీ త‌ను ఎప్ప‌టికీ కూల్ గా ప‌ని చేసుకుంటూ పోవ‌డ‌మే.

Also Read : Priya Bhavani Shankar Interesting :బ‌న్నీ అంటే ఇష్టం దేనికైనా సిద్దం

CinemaPrabhasRe-ReleaseSalaarTrendingUpdates
Comments (0)
Add Comment