Prabhas: ‘యానిమల్‌’ ట్రైలర్ పై ప్రభాస్ ప్రశంసల వర్షం

‘యానిమల్‌’ ట్రైలర్ పై ప్రభాస్ ప్రశంసల వర్షం

Prabhas : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ‘యానిమల్‌’ సినిమా ట్రెండ్ నడుస్తోంది. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా దర్శకుడిగా రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబరు 1న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఇటీవల దర్శకుడు సందీప్ వంగా విడుదల చేసిన ట్రైలర్ పై సిని ప్రియులతో పాలు ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సందీప్ వంగా టేకింక్‌కు ‘వావ్‌’ అంటున్నారు. ఇప్పటికే పలువురు అగ్ర తారలు దీనికి ఫిదా అయ్యామంటూ పోస్ట్‌లు పెట్టగా.. తాజాగా ప్రభాస్ ఈ ట్రైలర్ కు ఏకంగా రివ్యూ ఇచ్చారు.

Prabhas – ‘యానిమల్‌’ ట్రైలర్ పై సోషల్ మీడియాలో ప్రభాస్ పోస్ట్

సోషల్ మీడియాలో ఎప్పుడూ అరుదుగా కనిపించే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)… ‘యానిమల్‌’ సినిమా ట్రైలర్ పై ఆశక్తికరమైన రివ్యూ పోస్ట్ చేసారు. ‘‘యానిమల్‌’ ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ సినిమాలో అందరి నటన మరో స్థాయిలో ఉంది’’ అన్నారు.

నటి అలియా భట్‌ స్పందిస్తూ. ‘‘ట్రైలర్‌ చూస్తుంటే ఇప్పుడే సినిమా చూడాలనిపిస్తోంది. డిసెంబర్‌ 1 కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. థియేటర్లో కచ్చితంగా ఆడియన్స్‌తో ఈలలు వేయిస్తుంది’’ అని అన్నారు. అలాగే కరీనా కపూర్‌ స్పందిస్తూ.. “రణ్‌బీర్‌ మాత్రమే ఇలాంటి అద్భుతాలు చేయగలడని పేర్కొంటూ” ‘యానిమల్’ టీమ్‌కు ఆమె అభినందనలు తెలిపారు. మరోవైపు పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు ఈ ట్రైలర్‌ను షేర్‌ చేస్తూ గూస్‌బంప్స్‌ వస్తున్నాయని పేర్కొంటున్నారు.

డిసెంబరు 1న వస్తున్న ‘యానిమల్‌’

అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, రష్మిక హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘యానిమల్‌’. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 1న విడుదల కానుంది.

ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుని ‘A’ సర్టిఫికెట్ పొందిన ‘యానిమల్‌’ సినిమా… 3 గంటల 21 నిమిషాల 23 సెకన్లు & 16 ఫ్రేమ్స్‌ నిడివి (రన్ టైం) తో ఇటీవల కాలంలో వచ్చిన భారీ నిడివి గల చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాల జాబితాలో మూడో స్థానాన్ని సంపాదించింది.

Also Read : Keerthy Suresh: ఉమెన్స్ క్రికెట్ టీం గుడ్ విల్ అంబాసిడర్ గా కీర్తిసురేశ్‌

animalPrabhas
Comments (0)
Add Comment