Prasanth Varma : అందరి కళ్లు పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్రభాస్ పై ఉన్నాయి. ప్రస్తుతం తను ఓ వైపు మూవీస్ లో నటిస్తున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి బిగ్ హిట్. దీనికి సీక్వెల్ కల్కి-2 తీస్తున్నాడు. ఇందులో మరోసారి కీ రోల్ పోషిస్తున్నాడు ప్రభాస్. 25 శాతం షూటింగ్ పూర్తయింది. మరో వైపు మంచు విష్ణుతో కలిసి కన్నప్ప మూవీలో రుద్ర పాత్ర పోషిస్తున్నాడు. ఇంకో వైపు పాన్ ఇండియా డైనమిక్ డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ ను కన్ ఫర్మ్ చేశాడు.
Prasanth Varma-Prabhas Movie Updates
తాజాగా మరో కీలక అప్ డేట్ వచ్చింది ప్రభాస్ నుంచి. తను ప్రశాంత్ వర్మకు(Prasanth Varma) ఛాన్స్ ఇచ్చాడు. ప్రొడక్షన్ , ప్రీ-ప్రొడక్షన్ వివిధ దశలలో బహుళ సినిమాలు వరుసలో ఉన్నప్పటికీ పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడం విశేషం. కాగా ప్రశాంత్ వర్మ ఇప్పటికే జై హనుమాన్ మూవీతో టాప్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్నాడు. తను ఈ చిత్రాన్ని సీక్వెల్ చేస్తున్నాడు. హోంబాలే ఫిల్మ్స్ మద్దతుతో, రాబోయే వెంచర్ ఒక గ్రాండ్ పౌరాణిక ఫాంటసీ డ్రామా అవుతుందని భావిస్తున్నారు.
మేకర్స్ ఇంకా అధికారిక టైటిల్ ప్రకటించనప్పటికీ సోషల్ మీడియాలో ఇప్పటికే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. బాలీవుడ్ రణవీర్ సింగ్ కు కథను వర్మ చెప్పినట్లు సమాచారం.
Also Read : Popular Director Rajamouli-SSMB29 :హాలీవుడ్ రేంజ్ లో జక్కన్న మూవీ