Prabhas: అభిమానులకు ప్రభాస్ సంక్రాంతి సర్ ప్రైజ్ గిఫ్ట్ ?

అభిమానులకు ప్రభాస్ సంక్రాంతి సర్ ప్రైజ్ గిఫ్ట్ ?

Prabhas: బాహుబలి-2 తరువాత ఎంతోకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ‘సలార్’ సినిమాతో నెల రోజుల ముందే పండుగను తీసుకొచ్చారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. కేజిఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ‘సలార్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమేకాకుండా వెయ్యి కోట్ల క్లబ్ వైపు శరవేగంగా దూసుకుపోతుంది. దీనితో ప్రభాస్ అభిమానులకు నెల రోజుల ముందే సంక్రాంతి వచ్చినట్లు థియేటర్ల వద్ద ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సలార్ హిట్ తో ఆనందంలో ఊగిపోతున్న తన అభిమానులకు సంక్రాంతికి మరో గిఫ్ట్ ను రెడీ చేసారు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కించబోయే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Prabhas – సంక్రాంతికి మారుతి దర్శకత్వంలో ప్రభాస్ కొత్త సినిమా ఫస్ట్ లుక్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా మారుతి దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించగా… మరో రెండు పాత్రల్లో రిద్ది కుమార్, నిధి అగర్వాల్ కనిపించబోతున్నారని సమాచారం. దీనితో సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ను సంక్రాంతికి విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ సినిమాకు రాజాడీలక్స్ అనే పేరు పెట్టారని, హారర్-కామెడీ జానర్ లో సినిమా వస్తోందని, ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడని.. ఇలా చాలా అంటే చాలా ఊహాగానాలు వినిపించాయి. అయితే అన్ని ఊహా గానాలకు తెరదించేలా చిత్ర యూనిట్ సంక్రాంతి గిఫ్ట్ ను సిద్ధం చేసింది. సలార్ లో డైనోసార్ అనిపించున్న ప్రభాస్… ఇప్పుడు మారుతి సినిమాతో మరోసారి అందరికీ ఎంతో ఇష్టమైన డార్లింగ్ గా మారబోతున్నాడు. ఆ మేకోవర్ ఎలా ఉంటుందో ఫస్ట్ లుక్ లో చూడబోతున్నాం అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Also Read : Mahesh Babu: ‘కుర్చీ మడతపెట్టి’ పాట రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

Prabhassalar
Comments (0)
Add Comment