Prabhas Movie : ప్రభాస్ ఇప్పుడు హను రాఘవపూడితో మరో ప్రాజెక్టుకు సైన్

ఎన్నో ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న మన రెబల్ స్టార్

Prabhas Movie : బాహుబలి తర్వాత ప్రభాస్ ఆశించిన సూపర్‌హిట్‌ను అందించలేకపోయాడు. కష్టాల్లో ఉన్న ప్రభాస్ అభిమానులకు సలార్ సినిమా పూర్తి సంతోషాన్ని నింపింది. జనాలు చూడాలనుకునే స్థాయిలో ప్రభాస్‌ని చూపించడం వల్ల అది పెద్ద హిట్ అయింది. “కెజిఎఫ్‌` తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనంగా నిలిచింది.

Prabhas Movie Updates

ఈ సినిమా తర్వాత ప్రభాస్ ప్రస్తుతం మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం మరియు వైజయంతీ మూవీస్ నిర్మించింది. ఈ చిత్రంలో కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ షూటింగ్‌లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నాడు. ఈ సినిమా కూడా ఈ ఏడాదే విడుదల కానుంది. అదే సమయంలో సలార్ రెండో భాగం త్వరలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత “అర్జున్‌రెడ్డి“ “యానిమల్” వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌లను అందించిన సందీప్‌ వంగా దర్శకత్వంలో “స్పిరిట్‌` అనే పోలీస్‌ యాక్షన్‌ డ్రామాలో కనిపించనున్నాడు. ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభిస్తానని సందీప్‌ ఇటీవల తెలిపాడు. ఇది కాకుండా బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా కూడా ఉండబోతుంది.

ఎన్నో ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న మన రెబల్ స్టార్ ఇంకొన్ని రోజుల వరకు ఏ సినిమా ఒప్పుకోడని అంతా అనుకున్నారు. అయితే ప్రభాస్(Prabhas) మరో సినిమాకి అనుమతి ఇచ్చి అందరి ఆలోచనలు మార్చినట్టు సమాచారం.

‘సీతారామమ్’ వంటి క్లాసిక్ సూపర్‌హిట్‌లను అందించిన హను రాఘవపూడి తెలుగు ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ప్రభాస్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని తాజాగా సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ వెల్లడించారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ‘సీతారామమ్’ చిత్రానికి పనిచేసిన విశాల్ చంద్రశేఖర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ప్రభాస్(Prabhas)’ సినిమాకి కూడా పని చేస్తున్నాను. దీంతో ఈ చిత్రానికి ప్రభాస్‌ అనుమతి ఇచ్చినట్లు అధికారికంగా వెల్లడైంది. ఆ తర్వాత 3-4 సంవత్సరాలు ప్రభాస్ తన కెరీర్‌లో బిజీగా ఉండనున్నారు.

Also Read : Salaar 2 Updates : సలార్ 2 పై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ భార్య..అఖిల్ ఉన్నాడా లేడా

BreakingMoviesPrabhasTrendingUpdates
Comments (0)
Add Comment