Prabhas : ప్రభాస్ ‘కల్కి 2898 ఎడి’ చిత్రం సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు. తాజాగా ఆయన మరో ఘనత సాధించారు. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరోల జాబితాలో ఆయన టాప్‌లో నిలిచారు. తాజాగా ఆర్మాక్స్ జూన్ నెలకు సంబంధించి దేశవ్యాప్తంగా మోస్ట్ పాపురల్ హీరోల జాబితాను విడుదల చేసింది. ఇందులో డార్లింగ్ ప్రభాస్ ఆగ్ర స్థానంలో ఉన్నారు. మే నెలలో టాప్ వన్‌లో ఉన్న ఆయన జూన్‌లోనూ అదే స్థానంలో కొనసాగుతున్నారు. బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో విజయ్, ఇక ఈ జాబితాలో అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాలుగు, ఐదు స్థానాల్లో ఆరో స్థానంలో మహేశ్, ఏడు, ఎనిమిది స్థానాల్లో అక్షయ్‌కుమార్, సల్మాన్ ఖాన్ ఉండగా రామ్ చరణ్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. పదో స్థానంలో హృతిక్ రోషన్ ఉన్నారు.
Prabhas…
మోస్ట్ పాపులర్ హీరోయిన్‌ల జాబితాలో అలియాభట్ మొదటిలో ఉండగా.. సమంత, దీపికా పదుకొణె తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ రికార్డులు సృష్టిస్తోంది. రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం తాజాగా ‘బుక్‌మైషో’లో షారుక్ ఖాన్ ‘జవాన్’ రికార్డును అధిగమించింది.
Also Read : Rajinikanth : లేటెస్ట్ గా తలైవా మరో రెండు సినిమాల నుంచి కీలక అప్డేట్