Singham Again: ‘సింగమ్‌ అగైన్‌’లో ప్రభాస్‌ ?

‘సింగమ్‌ అగైన్‌’లో ప్రభాస్‌ ?

Singham Again: ఇటీవల కాలంలో టాలీవుడ్ హీరోలు బాలీవుడ్‌ లో తమ హవాను కొనసాగిస్తున్నారు. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇప్పటికే తనదైన ముద్రను బాలీవుడ్ లో వేసారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌… ‘వార్‌2’తో అక్కడి ప్రేక్షకులను అలరించనున్నారు. అలాగే తెలుగు సినిమాలు బీటౌన్‌ లోనూ మంచి కలెక్షన్లతో హవా కొనసాగిస్తున్నాయి. తాజాగా టాలీవుడ్‌ అగ్ర హీరో బాలీవుడ్‌ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరుస విజయాలతో జోష్‌ మీదున్న ప్రభాస్‌ బాలీవుడ్‌ సినిమా ‘సింగమ్‌ అగైన్‌’లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.

Singham Again Movie Updates

అజయ్‌ దేవగణ్‌ హీరోగా రోహిత్‌ శెట్టి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సింగమ్‌ అగైన్‌(Singham Again)’. ఇందులో ప్రభాస్‌ కనిపించనున్నారనే వార్త జోరందుకుంది. దీనికి కారణం లేకపోలేదు. తాజాగా దర్శకుడు ఈ సినిమాలో అతిథిపాత్ర చేయనున్న హీరోను ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ‘ఈ హీరో లేకపోతే ఈ చిత్రం అసంపూర్తిగా ఉంటుంది. దీపావళికి ఈ స్కార్పియోలోని నటుడు సందడి చేయనున్నాడు. కానీ, ఇక్కడ కూడా ఓ ట్విస్ట్‌ ఉంది’ అని ఆ నటుడు ఎవరో చెప్పకుండా కేవలం స్కార్పియో వస్తోన్న వీడియోను మాత్రమే పోస్ట్‌ చేశారు.

అయితే దాని బ్యాక్‌ గ్రౌండ్‌ లో ‘కల్కి’ లోని బుజ్జి థీమ్‌ సాంగ్‌ ను ఉపయోగించారు. దీంతో ఆ కారులో ఉన్నది ప్రభాస్‌ అని అభిమానులు భావిస్తున్నారు. ప్రభాస్‌ కాబట్టే ఆ మ్యూజిక్‌ తో రోహిత్‌ శెట్టి హింట్‌ ఇచ్చారని సంబరపడుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఈసారి ‘సింగమ్‌ అగైన్‌(Singham Again)’ మరింత గర్జించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మరోవైపు ఈ అతిథి పాత్రలో కోలీవుడ్‌ స్టార్‌ సూర్య కనిపించనున్నారని కూడా కొందరు అనుకుంటున్నారు. ఎందుకంటే సూర్య హీరోగా వచ్చిన ‘సింగం’ సినిమాలు ఏ స్థాయిలో హిట్‌ అయ్యాయో తెలిసిందే. అందుకే ఆయన ఈ బాలీవుడ్‌ ‘సింగమ్‌ అగైన్‌’లో కనిపిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రోహిత్‌ శెట్టి పెట్టిన వీడియోలోని హీరో ఎవరో చెప్పాలంటూ అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు.

‘సింగమ్‌ అగైన్‌’ విషయానికొస్తే… సింగం ఫ్రాంఛైజీలో తెరకెక్కుతున్న మూడో సినిమా ఇది. అజయ్‌ దేవ్‌గణ్‌ హీరో. అక్షయ్‌ కుమార్‌, రణ్‌వీర్‌ సింగ్‌, టైగర్‌ ష్రాఫ్‌, కరీనా కపూర్‌, దీపికా పదుకొణె వంటి అగ్ర తారలెందరో ఇందులో నటిస్తున్నారు. మొదటి ఈ చిత్రాన్ని ఆగస్టులో రిలీజ్‌ చేయాలని భావించారు. కానీ చిత్రీకరణ అనుకున్న సమయం కంటే ఎక్కువ పట్టడం… వీఎఫ్‌ఎక్స్‌ తదితర కారణాలతో దీన్ని ఈ ఏడాది దీపావళికి విడుదల చేయాలని నిర్ణయించారు.

Also Read : Director Tharun Sudhir: రెండు సంప్రదాయాల్లో కన్నడ దర్శకుడు, హీరోయిన్‌ ల పెళ్లి !

Ajay DevgnPrabhasSingham Again
Comments (0)
Add Comment