Prabhas Spirit Role : డార్లింగ్ ప్ర‌భాస్ పోలీస్ బాస్

వంగా సందీప్ రెడ్డి స్పిరిట్ లో

Prabhas : పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్ర‌భాస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. త‌న మార్కెట్ రేంజ్ కు త‌గ్గ‌ట్టుగా పాత్ర‌ల‌ను, సినిమాలు ఎంపిక చేసుకుంటున్నాడు. త‌ను న‌టించిన ఆది పురుష్ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కృతీ స‌న‌న్ స్క్రీన్ షేర్ చేసుకుంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్(Prabhas) బిజీగా ఉన్నాడు.

Prabhas Spirit Role Updates

డైరెక్ట‌ర్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రాజా సాబ్ మూవీలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. దాదాపు పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ అయిపోతే సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేయ‌నున్నారు.

ఇదే స‌మ‌యంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు పాన్ ఇండియా డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డి. త‌ను బాలీవుడ్ లో ర‌ణ్ బీర్ క‌పూర్ , ర‌ష్మిక మంద‌న్నాతో యానిమ‌ల్ తీశాడు. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. కోట్ల వ‌ర్షం కురిసింది. ఈ మూవీ ఇచ్చిన స‌క్సెస్ కిక్ తో వంగా సందీప్ రెడ్డి మ‌రో భారీ మూవీ ప్రాజెక్టును ప్ర‌క‌టించాడు. అదే స్పిరిట్. ఇప్ప‌టికే టైటిల్ ను ఖ‌రారు చేశాడు. ఇందులో కీ రోల్ లో డార్లింగ్ ప్ర‌భాస్ ను ఎంచుకున్నాడు. హీరోయిన్ ఎవ‌ర‌నేది ఇంకా క‌న్ ఫ‌ర్మ్ చేయ‌లేదు.

మ‌రో వైపు స్పిరిట్ గురించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. అదేమిటంటే ప్ర‌భాస్ అత్యంత ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ ఏడాది రిలీజ్ కాబోయే మూవీపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నాడు పాన్ ఇండియా స్టార్.

Also Read : Beauty Trisha Identity OTT : ఓటీటీలో త్రిష కృష్ణ‌న్ ఐడెంటిటీ

CinemaPrabhasSpiritTrendingUpdates
Comments (0)
Add Comment