Hero Prabhas-Kannappa :షేక్ చేస్తున్న ప్ర‌భాస్ క‌న్న‌ప్ప టీజ‌ర్

ఇక సినిమా పండుగేనంటున్న ఫ్యాన్స్

Kannappa : డార్లింగ్ ప్ర‌భాస్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం క‌న్న‌ప్ప‌(Kannappa). ఈ సినిమాకు సంబంధించి మూవీ మేక‌ర్స్ టీజ‌ర్ రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ ను ఆక‌ట్టుకునేలా ఉంది. ప్ర‌త్యేకించి ప్ర‌భాస్ లుక్ అదుర్స్ అనిపించేలా ఉండ‌డంతో తెగ ముచ్చ‌ట ప‌డుతున్నారు. భారీ ఎత్తున ఆద‌రిస్తున్నారు. ఇప్ప‌టికే బాహుబ‌లి, క‌ల్కి మూవీల‌తో జాతీయ స్థాయిలో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్ర‌భాస్. త‌న మార్కెట్ వాల్యూ రూ. 1000 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని సినీ వ‌ర్గాల అంచ‌నా.

Kannappa Teaser Sensation

ఇక క‌న్న‌ప్ప టీజ‌ర్ ఇటు అభిమానుల‌ను అటు ప్రేక్ష‌కుల‌ను మ‌రింత ఆస‌క్తి రేకెత్తించేలా చేసింది. ఈ చిత్రం భ‌క్త క‌న్న‌ప్ప పురాణ గాథ నుండి ప్రేర‌ణ పొందింది. ఇందులో దేశంలోనే పేరు పొందిన న‌టీ న‌టులు న‌టిస్తుండ‌డం విశేషం. అత్యంత ఎదురు చూస్తున్న ప్రాజెక్టుల‌లో ఒక‌టిగా నిలిచింది ఈ చిత్రం.

బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ శివుని పాత్ర పోషిస్తుండ‌గా ల‌వ్లీ బ్యూటీ కాజ‌ల్ అగ‌ర్వాల్ పార్వ‌తి దేవి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఇక ప్ర‌భాస్ విష‌యానికి వ‌స్తే క‌న్న‌ప్ప చిత్రంలో త‌నే కీల‌క పాత్ర . ఇందులో రుద్ర రూపంలో క‌నిపించేందుకు రెడీ అవుతున్నాడు .

ఇదిలా ఉండ‌గా నెల రోజుల కింద‌ట క‌న్న‌ప్ప టీం విడుద‌ల చేసిన ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్ పై ఫ్యాన్స్ , సినీ ప్రియులు తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. డిజైన్ బాగోలేదంటూ పేర్కొన్నారు. తాజాగా రిలీజ్ చేసిన టీజ‌ర్ లో మాత్రం ప్ర‌భాస్ లుక్ అదిరి పోయేలా ఉండ‌డంతో శాంతించారు.

Also Read : Beauty Meenakshi Chaudhary :ఏపీ ప్ర‌చారక‌ర్త‌గా మీనాక్షి చౌద‌రి

Comments (0)
Add Comment