Hero Prabhas New Look :రుద్ర రూపంలో ప్ర‌భాస్ అదుర్స్ 

క‌న్న‌ప్ప చిత్రంలో పోస్ట‌ర్ రిలీజ్ 

Prabhas : పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్ర‌భాస్ సంచ‌ల‌నంగా మారారు. త‌ను కీల‌క పాత్ర‌లో ప్ర‌స్తుతం క‌న్న‌ప్ప చిత్రంలో న‌టిస్తున్నారు. పౌరాణిక నేప‌థ్యంలో దీనిని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన క‌ల్కి సూప‌ర్ హిట్ గా నిలిచింది. ప్ర‌స్తుతం క‌ల్కి -2 సీక్వెల్ కొన‌సాగుతోంది. ఇదే స‌మ‌యంలో వంగా సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో స్పిరిట్ పై ఫోక‌స్ పెట్టాడు ప్ర‌భాస్.

Prabhas New Look Viral

తాజాగా క‌న్న‌ప్ప మూవీలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. దైవిక సంర‌క్ష‌కుడిగా రుద్రుడి పాత్ర‌లో న‌టిస్తున్నాడు ప్ర‌భాస్(Prabhas). తాజాగా ఇందుకు సంబంధించిన పోస్ట‌ర్ రిలీజ్ చేశారు మూవీ మేక‌ర్స్. ఈ సంద‌ర్బంగా సినిమా విడుద‌ల తేదీని కూడా ఖ‌రారు చేశారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

క‌న్న‌ప్ప‌లో అచంచ‌ల ర‌క్ష‌కుడిగా బ‌లం, జ్ఞానం, భ‌క్తి, త్యాగం, ప్రేమ కాలాతీత ప్ర‌యాణం గురించి త‌న పాత్ర ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశాడు న‌టుడు ప్ర‌భాస్. ఇదిలా ఉండ‌గా ముఖేష్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు క‌న్న‌ప్ప  చిత్రానికి. ఇందులో విష్ణు మంచు టైటిల్ పాత్ర‌లో న‌టించాడు. త‌న‌తో పాటు బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్, మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్, న‌టి కాజ‌ల్ అగ‌ర్వాల్ అతిథి పాత్ర‌ల‌లో న‌టించారు.

Also Read : క్రిప్టో క‌రెన్సీ కేసు త‌మ‌న్నా..కాజ‌ల్ కు షాక్

New LookPrabhasTrendingUpdates
Comments (0)
Add Comment