Prabhas: లండన్‌ లో ఇల్లు కొన్న ప్రభాస్‌ ?

లండన్‌ లో ఇల్లు కొన్న ప్రభాస్‌ ?

Prabhas: రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్… యోగి, ఛత్రపతి, మిస్టర్ ఫెర్ఫెక్ట్, డార్లింగ్, మిర్చి సినిమాలతో అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. అయితే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన బాహుబలి సిరీస్ తో ప్రభాస్ ఏకంగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. బాహుబలి తరువాత పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన రాధేశ్యామ్, సాహో, ఆదిపురుష్ సినిమాలు డిజాస్టర్ లుగా నిలిచినప్పటికీ ప్రభాస్(Prabhas) క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇటీవల కేజీఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘సలార్‌ ’ సినిమాతో బాలీవుడ్ లో మరల తన పూర్వ వైభవం దక్కించుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్… వైజయంతి మూవీస్ పతాకంపై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న అతి భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె, అమితాబ్‌ బచ్చన్‌, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Prabhas Properties

టాలీవుడ్ నుండి బాలీవుడ్ మాత్రమే కాదు పాన్ వరల్డ్ స్టార్ గా మరిన ప్రభాస్(Prabhas) ఇప్పుడు ఎక్కువ రోజులు విదేశాల్లో గడపాల్సి వస్తుంది. టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తొలిరోజుల్లో హైదరాబాద్, చెన్నైలకే పరిమితం అయిన ఈ యంగ్ రెబల్ స్టార్… బాహుబలి సినిమాలతో ముంబైకు మకాం మార్చాల్సి వచ్చింది. ఒక రాధేశ్యామ్, సాహో సినిమా కోసం ఏకంగా విదేశాల్లో ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చింది. దీనితో ప్రభాస్ కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది. లండన్‌ లో విలాసవంతమైన ఇంటిని ఆయన కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సినిమా షూట్స్‌, వెకేషన్స్‌ కోసం అక్కడికి వెళ్లినప్పుడల్లా ఓ ఇంట్లో ఉండేవారని… దానికి రూ. కోటి వరకు అద్దె చెల్లించేవారని సమాచారం. ఆ ఇల్లు బాగా నచ్చడంతో భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ప్రభాస్ నుండి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాని నెటిజన్లు మాత్రం ప్రభాస్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read : NTR 31: రెండు భాగాలుగా ఎన్టీఆర్‌ – ప్రశాంత్ నీల్ సినిమా ?

Kalki 2898 ADPrabhasSalaar
Comments (0)
Add Comment