Prabhas: బ్రిటీష్ సైనికుడి పాత్రలో ప్రభాస్ ?

బ్రిటీష్ సైనికుడి పాత్రలో ప్రభాస్ ?

Prabhas: పాన్ ఇండియా హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల ‘కల్కి 2898 ఏడీ’సినిమాతో వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన రెండో సినిమాగా రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఇదే స్పీడ్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టాడు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమాలో నటిస్తున్నారు. దీని తరువాత సలార్ 2 సినిమాకు దర్శకుడు ప్రశాంత్ నీల్ సన్నాహాలు చేస్తున్నాడు. అయితే సలార్ 2 సెట్స్ పైకి వెళ్ళడానికి కాస్త సమయం పట్టేటట్లు కనిపించడంతో… సీతారామం ఫేం హాను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాను మైత్రీ మూవీస్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

Prabhas Movie Updates

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ సినిమాకి ‘ఫౌజీ’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారని. ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌(Prabhas) సైనికుడిగా కనిపించబోతున్నట్లు సమాచారం. అందుకే ఈ టైటిల్‌ పెడితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోందట. ప్రస్తుతానికి ఇదే ఈ సినిమా వర్కింగ్‌ టైటిల్‌. దీనికంటే మంచి టైటిల్‌ ఆలోచన వస్తే… దాన్నే ఫిక్స్‌ చేస్తారట. లేదా ‘ఫౌజీ’ టైటిల్‌నే ఖరారు చేస్తారట.

1947 కంటే ముందు సాగే కథ ఇది. ప్రభాస్‌(Prabhas) బ్రిటీష్‌ సైన్యంలో ఓ సోల్జర్‌ గా కనిపించనున్నాడు. యుద్థ నేపథ్యం ఉన్నా హను స్టైల్‌లో సాగే అందమైన ప్రేమకథ కూడా ఇందులో మేళవించబోతున్నారని వినికిడి. యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథగా రూపొందనున్న ఈ సినిమా కథనం భారతదేశ స్వాతంత్య్రం పూర్వానికి ముందు జరుగుతుందని, బ్రిటిష్‌ సైన్యంలో పని చేసే సైనికుడి పాత్రలో ప్రభాస్‌ కనిపిస్తారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఈ పాత్ర కోసం ప్రభాస్‌ స్పెషల్‌గా మేకోవర్‌ కానున్నారట. కథానాయికగా చాలా పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ‘సీతారామం’ ఫేమ్‌ మృణాళ్‌ ఠాకూర్‌ పేరు దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. విశాల్‌ చంద్రశేఖర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని బాణీలు సిద్థం చేసినట్టు తెలుస్తోంది. ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ లవ్‌ స్టోరీ ‘ఫౌజి’ చిత్రీకరణను ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబరు మొదట్లో ప్రారంభించాలనుకుంటున్నారని తెలిసింది.

ప్రభాస్‌ హీరోగా అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్‌ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా గత నెల 27న విడుదలైన విషయం తెలిసిందే. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సి. అశ్వినీదత్‌ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. వెయ్యి కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించినట్లుగా చిత్రబృందం శనివారం అధికారికంగా ప్రకటించింది.

Also Read : Nayanthara: త్రిషను వెనక్కి నెట్టి ఛాన్స్ నిలబెట్టుకున్న నయనతార !

Hanu RaghavapudiMrunal ThakurPrabhasSeetharamam
Comments (0)
Add Comment