Prabhas : ‘వీడు ఎక్కడున్నా రాజేరా’ అని ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్‌ను ఉద్దేశించి ఓ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్‌ను అక్షరాలా నిజం చేసి చూపిస్తున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెంబర్స్‌తో కొలవలేని స్థానం ప్రభాస్‌ది. టాలీవుడ్ దశ, దిశ మార్చిన డైరెక్టర్ రాజమౌళి అయితే.. హీరో మాత్రం ప్రభాస్(Prabhas) అనే చెప్పి తీరాలి. ఆయన చేసే సినిమాలు, ఆయన చేసే దానాలు, ఆయన పెట్టే తిండి.. అన్నీ కూడా భారీగానే ఉంటాయి. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి తన గొప్ప మనసును చాటాడీ ‘సలార్’. వయనాడ్ విపత్తు బాధితులకు అండగా నిలబడేందుకు చిత్ర పరిశ్రమలోని పలువురు స్టార్స్ ముందుకొస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ నుంచి ఇప్పటికే సెలబ్రిటీలెందరో సాయం ప్రకటించారు. తాజాగా ప్రభాస్ వయనాడ్ విపత్తు సహాయార్థం రూ. 2 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించి.. తన గొప్ప మనసును చాటుకున్నారు.
Prabhas Helps Wayanad..
సినిమాలే కాదు.. ప్రభాస్ చేసే సహాయాలు కూడా భారీగా ఉంటాయని ఇప్పటికే పలుమార్లు ఆయన నిరూపించారు. ఎటువంటి విపత్తు సంభవించినా.. అవసరం అని తన తలుపు తట్టినా.. ప్రభాస్(Prabhas) స్పందించే విధానం ఎప్పుడూ ఆయనని నెంబర్ వన్ స్థానంలో నిలబెడుతుంది. అలా అనీ మిగతావారిని తక్కువ చేయడం కాదు కానీ.. ప్రభాస్ సాయం చేసే గుణం అలాంటిది అని చెప్పడం మాత్రమే ఇక్కడ ఉద్దేశ్యం. వయనాడ్ బాధితుల సహాయార్థం కేరళ సీఏం రిలీఫ్ ఫండ్‌కు ప్రకటించిన ఈ సాయంతో ప్రభాస్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ ఫర్ ఏ రీజన్ అంటూ ఫ్యాన్స్ ఆయన పేరుని టాప్‌లో డ్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. ఈ సాయంపై అభిమానులు, నెటిజన్లు మాత్రమే కాకుండా.. ప్రభాస్‌ది చాలా గొప్ప మనసు అంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తుండటం గమనార్హం.
మోహన్ లాల్- రూ.3 కోట్లు
ప్రభాస్- రూ. 2 కోట్లు
చిరంజీవి, రామ్ చరణ్- 1 కోటి
సూర్య, జ్యోతిక దంపతులు- రూ.50 లక్షలు
మమ్ముట్టి, దుల్కర్- రూ.40 లక్షలు
కమల్ హాసన్- రూ.25 లక్షలు
అల్లు అర్జున్- 25 లక్షలు
ఫహాద్ ఫాజిల్- రూ.25 లక్షలు
విక్రమ్- రూ.20 లక్షలు
రష్మిక- రూ.10 లక్షలు
సితార ఎంటర్‌టైన్‌మెంట్ వంశీ- రూ. 5 లక్షలు
సంయుక్త మీనన్- నెంబర్ తెలియదు
Also Read : Yash: సాధారణ భక్తుడిగా దేవాలయాలను దర్శించుకుంటున్న యశ్ !