Prabhas : వరుస చిత్రాలు, విజయాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. సలార్-2, కల్కి-2, స్పిరిట్, రాజాసాబ్ చిత్రాల షూటింగ్, స్టోరీ సిట్టింగ్‌లతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ఆయన మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఆయన హీరోగా తెరకెక్కనున్న సినిమా షూటింగ్ శనివారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Prabhas Movie Updates
మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ చిత్రంలోని ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్‌కు స్టెప్పులేస్తూ చేసి రీల్ విపరీతంగా వైరల్ అయిన పాకిస్థానీ డాన్స్ కొరియోగ్రాఫర్ ఇమాన్ ఇస్మాయిల్ ఈ చిత్రంలో కథానాయికగా నటించనుంది. పూర్తిస్థాయి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనుంది. ఇప్పటికే విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రం కోసం మూడు పాటలు కంపోజ్ చేసినట్లు దర్శకుడు హను రాఘవపూడి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పాన ఇండియా స్థాయిలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తారు.
Also Read : Nidhhi Agerwal : ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి నిధి అగర్వాల్ పోస్టర్