Aditi Govitrikar : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవర్ స్టార్ హీరోయిన్

1999 తమ్ముడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ముంబైకు చెందిన అదితి...

Aditi Govitrikar : ఆమె ఒకప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. సుమారు పాతి కేళ్ల క్రితం హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అది కూడా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాతో. ఇంకేముంది మొదటి సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ క్యూటీ అందాన్ని చూసి కుర్రకారు ఊగిపోయారు. సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఈ అందాల తార మరిన్న మూవీస్ చేస్తుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. పవన్ సినిమా తర్వాత కేవలం ఒక్క తెలుగు మూవీతోనే సరి పెట్టుకుంది. ఆ తర్వాత ఊసే లేకుండా పోయింది.

మళ్లీ ఇప్పుడు ఇలా తిరుమల(Tirumala) శ్రీవారి కొండపై ప్రత్యక్షమైంది. ఆమెను చూసిన భక్తులు మొదట గుర్తు పట్టలేదు కానీ తర్వాత ఆమె ఎవరో తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అప్పటికీ ఇప్పటికీ ఎంత మారిపోయిందిరా? అంటూ ముక్కున వేలేసుకున్నారు. మరి ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? కష్టంగా ఉందా? అయితే మీకో క్లూ.. ‘హే పిల్లా నీ పేరు లవ్లీ.. జారిపోకే చేపల్లే తుళ్లి.. జాంపండులా ఉన్నావే బుల్లి’.. సాధారణంగా ఈ పాట వినగానే అందరికీ పవన్ కల్యాణ్ గుర్తుకు వస్తారు. కానీ ఇదే పాటలోనే ఓ గ్లామరస్ హీరోయిన్ కనిపిస్తుంటుంది. మోడ్రన్ డ్రెస్సులో సన్ గ్లాసెస్ తో కుర్రకారును కవ్విస్తుంటుంది. పై ఫొటోలో ఉన్నది ఆ హీరోయినే. ఈ అందాల తార పేరు అదితి గోవిత్రికర్(Aditi Govitrikar).

Aditi Govitrikar Visited…

1999 తమ్ముడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ముంబైకు చెందిన అదితి.దీని తర్వాత మౌనమేలనోయి అని మరో తెలుగు సినిమా చేసింది. అంతే ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ కే షిఫ్ట్ అయిపోయింది. 2021 వరకు పలు హిందీ, మరాఠీ సినిమాల్లో నటించింది. కానీ పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. కరోనా కాలంలోనూ ఓ నాలుగైదు వెబ్ సిరీసుల్లోనూ మెప్పించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఎలాంటి సినిమాలు, సిరీస్ లు లేవు. శుక్రవారం అదితీ గోవిత్రికర్ తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిపోయాయి. తమ్ముడు హీరోయిన్ ఎంతలా మారిపోయిందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.సినిమాల సంగతి పక్కన పెడితే.. 1998లో ముఫ్పాజాల్ లక్డావాలా అనే డాక్టర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అదితి.వీళ్లకు ఇద్దరు పిల్లలు పుట్టారు. కానీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో 2009లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలే జీవితంగా గడుపుతోంది అదితి.

Also Read : Samantha : సినిమాల్లో స్పీడ్ తగ్గిన గ్లోబల్ రేంజ్ లో క్రేజ్ అలానే..

heroinepawan kalyanTrendingUpdatesViral
Comments (0)
Add Comment