Poonam-Trivikram : డైరెక్టర్ త్రివిక్రమ్ పై సంచలన ట్వీట్ చేసిన నటి పూనమ్

‘త్రివిక్రమ్‌పై గతంలోనే మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశా...

Poonam : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు , హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌కు మధ్య కొంతకాలంగా సోషల్‌ మీడియా వేదికగా గొడవ నడుస్తోంది. సందర్భం వచ్చిన ప్రతిసారీ ఆమె త్రివిక్రమ్‌పై విరుచుకుపడుతుంది. తాజాగా ఆమె చేసిన ట్వీట్‌ మరోసారి సంచలనం సృష్టిస్తోంది. సినీ పెద్దలు త్రివిక్రమ్‌ని గట్టిగా ప్రశ్నించాలని కోరింది. ఓ పక్క మాలీవుడ్‌లో హేమ కమిటీ రిపోర్ట్‌, టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపులు కేసు నమోదైన నేపథ్యంలో ట్వీట్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది.

Poonam Tweet

‘త్రివిక్రమ్‌పై గతంలోనే మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశా. కానీ సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదు. నన్ను రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. సినీ పెద్దలు ఇప్పుడైనా ఈ విషయమై త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలి.’ అని పూనమ్‌ కౌర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే కొరియోగ్రాఫర్‌ జానీని ఇకపై మాస్టర్‌ అని పిలవద్దని ఆమె మరో ట్వీట్‌ వేసింది. మాస్టర్‌ అనే పదం విలువైనదని ఆమె పేర్కొంది.

Also Read : Kangana Ranaut : ఆ సినిమా వాయిదా పడటం వలన ఆ ఇల్లు అమ్మేసారు

BreakingPoonam KaurTrivikram SrinivasTweetViral
Comments (0)
Add Comment