Poonam Pandey : వైరల్ అవుతున్న పూనమ్ పాండే భర్త వ్యాఖ్యలు

పూనమ్ చనికుపోయిందని వార్త తెలిసినప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదు

Poonam Pandey : పూనమ్ పాండే .. గత రెండు మూడు రోజులుగా ఈ అమ్మడు పేరు తెగ వినిపిస్తుంది. దేశప్రజలను ఒక్కసారిగా బ్లఫ్ చేసింది పూనమ్ పాండే.. తాను చనిపోయానంటూ సోషల్ మీడియాలో షేర్ చేసి ఒక్కసారిగా అందరిని షాక్ కు గురిచేసింది పూనమ్. సర్వైకల్ క్యానర్ తో పూనమ్ పాండే చనిపోయిందని ఫిబ్రవరి 2న ఓ పోస్ట్ సోషల్ మీడియాలో అదికూడా తన ఇన్ స్టా అకౌంట్ లోనే పోస్ట్ చేశారు. దాంతో అంతా ఒక్కసారిగా అవాక్ అయ్యారు. చాలా యాక్టివ్ గా ఉండే పూనమ్ పాండే చనిపోయిందంటూ వార్తలు రావడంతో ఆమె అభిమానులు ఎమోషనల్ అయ్యారు. అప్పటి వరకు యాక్టివ్ గా ఉన్న పూనమ్ పాండే చనిపోవడం ఏంటి అంటూ కొంతమంది సోషల్ మీడియాలో చర్చించుకున్నారు. కొంతమంది ఆమె చనిపోలేదు డ్రామాలు ఆడుతుంది అంటూ కూడా కామెంట్స్ చేశారు.

Poonam Pandey Husband Comments

చాలా మంది అనుకున్నట్టే పూనమ్ పాండే(Poonam Pandey) అందరిని బ్లఫ్ చేసింది. తాను చనిపోలేదు అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. సర్వైకల్ క్యానర్ పై అవగాహనా కల్పించడానికినే తాను అలా చేశాను అని తెలిపింది పూనమ్ పాండే. దాంతో చాలా మంది పూనమ్ పాండేను ట్రోల్ చేస్తున్నారు. చాలా మంది ఆమెను తిడుతూ పోస్ట్ లు పెడుతున్నారు. తాజాగా పూనమ్ పాండే భర్త షాకింగ్ కామెంట్స్ చేశాడు. పూనమ్ పాండే సామ్ బాంబేను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయి. తాజాగా పూనమ్ పాండే భర్త మాట్లాడుతూ.. తామిద్దరం ఇంకా విడాకులు తీసుకోలేదు అని తెలిపాడు.

పూనమ్ చనికుపోయిందని వార్త తెలిసినప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. అలా జరిగి ఉండదని నాకు అనిపించింది. ఎందుకంటే మీరు ఎవరికైనా కనెక్ట్ అయ్యి ఉంటే వారికి ఏదైనా జరిగితే ముందే తెలుస్తుంది అని అన్నారు సామ్ బాంబే. నేను ప్రతిరోజూ ఆమె గురించి ఆలోచిస్తా అని తెలిపారు. ఆమె చాలా ధైర్యవంతురాలు.. ఆమె బతికే ఉన్నందుకు సంతోషంగా ఉంది అని తెలిపాడు సామ్.

Also Read : Klimkara Care Taker: మెగాస్టార్ మనుమరాలు క్లీంకారా కేర్ టేకర్ ఎవరో మీకు తెలుసా ?

BreakingCommentsTrendingUpdatesViral
Comments (0)
Add Comment