Poonam Kaur Shocking :గురూజీ కాపీ మాస్ట‌ర్ పూన‌మ్ కౌర్ సెటైర్

త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ పై షాకింగ్ కామెంట్స్ 

Poonam Kaur : తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో పూన‌మ్ కౌర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. త‌ను ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడుతుంది. మ‌న‌సులో ఏదీ దాచుకోదు. త‌ను ఎందుక‌నో గ‌త కొంత కాలం నుంచి మోస్ట్ టాలెంటెడ్ , మాట‌ల మాంత్రికుడిగా పేరు పొందిన ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ను టార్గెట్ చేస్తూ వ‌స్తోంది. వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా త‌ను సెటైర్స్ వేస్తూ, కామెంట్స్ చేస్తూ నిత్యం వార్త‌ల్లో ఉంటోంది. తాజాగా ఎక్స్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం విస్తు పోయేలా చేసింది.

Poonam Kaur Shocking Comments

పేరు డైరెక్టుగా వాడ‌కుండానే గురూజీ అంటూ సంబోదించింది. త‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్, స‌మంత రుత్ ప్ర‌భుతో క‌లిసి తీసిన అత్తారింటికి దారేది మూవీ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించింది. ఇందులో ఇంటి నుంచి ప‌బ్ కు వెళ్లే స‌మ‌యంలో త‌న కారులోనే డ్రెస్ మార్చుకునే స‌న్నివేశం గురించి పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఫోటోను పంచుకుంది. దీనిని త‌ను మ‌క్కీకి మ‌క్కీ కాపీ కొట్టాడంటూ ఆరోపించింది. ఇదిగో ఆధారం అంటూ చూడండి అంటూ స్ప‌ష్టం చేసింది పూన‌మ్ కౌర్(Poonam Kaur).

ఇదిలా ఉండ‌గా పంచ్ లు, ప్రాస‌లు, ఆక‌ట్టుకునే స‌న్నివేశాల‌ను తీయ‌డంలో పాపుల‌ర్ అయ్యాడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. త‌ను మంచి వ‌క్త కూడా. అయితే గ‌తంలో పూన‌మ్ కౌర్ కు సినిమా ఛాన్స్ ఇస్తాన‌ని చెప్పి మోసం చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. త్రివిక్ర‌మే కాదు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఆ మ‌ధ్య‌న ఏకి పారేసింది పూన‌మ్ కౌర్. ఏది ఏమైనా గురూజీ రియ‌ల్ కాపీ మాస్ట‌ర్ అంటూ చేసిన కామెంట్ టాలీవుడ్ లో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ఇంత‌గా కామెంట్స్ చేస్తూ వ‌స్తున్నా త్రివిక్ర‌మ్ మాత్రం త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతున్నాడు.

Also Read : Beauty Sai Pallavi-Chai Thandel :తండేల్ క‌ళక‌ళ కాసులు గ‌ల‌గ‌ల

CommentsPoonam KaurShockingTrivikram SrinivasViral
Comments (0)
Add Comment