Poonam Kaur : ఆ దర్శకుడిపై సంచలన వ్యాఖ్యలు చేసిన పూనమ్ కౌర్

దీంతో గ‌త‌ కొన్ని సంవ‌త్స‌రాలుగా త‌నకు సంబంధించి వ‌స్తున్న‌ వార్త‌ల‌ విష‌యంలో క్లారిటీ ఇచ్చింది...

Poonam Kaur : తెలుగ‌మ్మాయి, న‌టి పూనం కౌర్ మ‌రోసారి బాంబు పేల్చింది. గ‌త కొంత కాలంగా త‌రుచూ సినీ దర్శకులు, హీరోలపై విమర్శలు చేస్తూ పోస్టులు పెడుతూ వ‌చ్చిన ఆమె అప్పట్లో ఓ దర్శకుడు ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడంటూ సంచలన కామెంట్స్ చేసిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల కూడా ప‌లు సంద‌ర్భాల్లో ఈ వ్యాఖ్య‌లు చేసిన పూన‌మ్(Poonam Kaur) టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.. తాజాగా ఇప్పుడు మరోసారి ఓ దర్శకుడు ఓ అమ్మాయిని గర్భవతిని చేశాడంటూ సంచలన పోస్టు చేసింది.

దీంతో గ‌త‌ కొన్ని సంవ‌త్స‌రాలుగా త‌నకు సంబంధించి వ‌స్తున్న‌ వార్త‌ల‌ విష‌యంలో క్లారిటీ ఇచ్చింది. ‘ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ప్రముఖ డైరెక్టర్ ఓ పంజాబీ అమ్మాయిని గర్భవతిని చేశాడు.. ఆమె కెరీర్‌ను నాశనం చేశాడంటూ’ పూన‌మ్(Poonam Kaur) ఎక్స్ లో పోస్ట్ చేసింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ జోక్యంతో ఆ స‌మ‌యంలో ఆ పంజాబీ బ్యూటీకి కాస్త సాయం లభించిందని వెల్లడించింది. అయితే అతడు నాయ‌కుడిగా మారిన నటుడు కాదు.. అత‌నో ద‌ర్శ‌కుడు అంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంలో న‌న్ను, ఓ నటుడైన‌ రాజకీయ నాయకుడిని అనవసరంగా లాగారు అంటూ పూనం రాసుకోచ్చింది. కాగా పూనమ్ వారి పేర్లు ప్రస్తావించకపోవడంతో ఆమె చేసిన‌ వ్యాఖ్య‌లు ఎవ‌రిపై అంటూ నెటిజ‌న్లు త‌మ శైలిలో స్పందిస్తున్నారు.

Poonam Kaur Comments..

ఇదిలాఉండ‌గా టాలీవుడ్‌లో ఇటీవ‌ల వెలుగు చూసిన క్యాస్టింగ్ కౌచ్, జానీ మాస్ట‌ర్ ఇష్యూల‌ నేప‌థ్యంలో న‌టి పూన‌మ్ కౌర్ కూడా స్పందించి త‌న‌కు జ‌రిగిన అనుభ‌వాన్ని వెళ్ల‌డించింది. స‌ద‌రు వ్య‌క్తిని కూడా విచారించాలంటూ ట్విట్ల‌ర్ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈ క్ర‌మంలో కొంద‌రు పూనమ్‌కి పిచ్చి పట్టింది.. ఆమెకు ఏమైనా జ‌రిగి ఉంటే ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేయాలి కానీ ఇలా సోష‌ల్ మీడియాలో లేనిపోని పోస్టులు పెట్టడం ఎందుకు అంటూ విమ‌ర్శించారు. ఈ నేప‌థ్యంలోనే పూన‌మ్ కౌర్ ఓ పంజాబీ అమ్మాయికి జ‌రిగిన అన్యాయం, అందుకు కార‌కులెవ‌ర‌నే విష‌యాల‌పై క్లారిటీ ఇచ్చింది.

Also Read : Big Boss18 : బాలీవుడ్ బిగ్ బాస్ హౌస్ కి కంటెస్టెంట్ గా గాడిద..!

CommentsPoonam KaurSlamsViral
Comments (0)
Add Comment