Pooja Hegde Shocking : నోరు జారిన బుట్ట బొమ్మ వైర‌ల్

ఆ మూవీ తమిళం అంటూ కామెంట్

Pooja Hegde : ఈ మ‌ధ్య‌న ఏదో ఒక కామెంట్ చేస్తూ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో కొన‌సాగుతూ వ‌స్తోంది బుట్ట బొమ్మ ల‌వ్లీ బ్యూటీ పూజా హెగ్డే(Pooja Hegde). త‌ను తాజాగా షాహిద్ క‌పూర్ తో క‌లిసి దేవా మూవీ చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉంది. ఉన్న‌ట్టుండి తాను తెలుగులో బ‌న్నీతో న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీ అల వైకుంఠ‌పురంలో మూవీ గురించి నోరు జారింది. అది త‌మిళ మూవీ అంటూ పేర్కొంది.

Pooja Hegde Shocking Comments

విచిత్రం ఏమిటంటే ఈ మూవీని మాట‌ల మాంత్రికుడిగా పేరొందిన టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తీశాడు. ఇందులో అల్లు అర్జున్ తో క‌లిసి పూజా హెగ్డే న‌టించింది. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. భారీ వ‌సూళ్లు సాధించింది. ఇండ‌స్ట్రీని షేక్ చేసింది. ఈ మూవీకి సంగీతం , పాట‌లు హైలెట్ గా నిలిచాయి. రాములో రాములా, నీ కాళ్ల‌ను ప‌ట్టుకు అనే సాంగ్స్ చార్ట్స్ లో టాప్ లో కొన్నేళ్ల పాటు అలాగే ఉన్నాయి.

త‌ను న‌టించిన హిట్ సినిమాల‌లో అల వైకుంఠ పురంలో ఒక‌టి అని, అయితే త‌మిళంలో వ‌చ్చిందంటూ నోరు జారింది ఈ ముద్దుగుమ్మ‌. దీంతో నెటిజ‌న్లు, బ‌న్నీ అభిమానులు పూజా హెగ్డేను ఏకి పారేస్తున్నారు. నువ్వు న‌టించిన సినిమాలే నీకు తెలియ‌క పోతే ఎలా అంటూ మండి ప‌డుతున్నారు. దీంతో గుర్తించిన పూజా హెగ్డే స‌ర్ది చెప్పేందుకు నానా తంటాలు ప‌డుతోంది. మాట్లాడ‌టం ఎందుకు..స‌ర్దు కోవ‌డం ఎందుకంటున్నారు మ‌రికొంద‌రు నెటిజ‌న్లు.

Also Read : Hero Mahesh SSMB29 : మ‌హేష్..జ‌క్క‌న్న మూవీలో ప్రియాంక విల‌నా..?

CommentsPooja HegdeShockingViral
Comments (0)
Add Comment