Beauty Pooja Hegde : ల‌క్ కాదు టాలెంట్ వ‌ల్లే సినిమాల్లో ఛాన్స్

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే

Pooja Hegde : ఎప్పుడూ కూల్ గా ఉండే బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde)కు ఉన్న‌ట్టుండి కోపం వ‌చ్చింది. ప‌దే ప‌దే ప్ర‌శ్న‌లు అడ‌గ‌డంతో జ‌ర్న‌లిస్టుల‌పై ఒకింత ఫైర్ అయ్యింది. చివ‌ర‌కు న‌టుడు షాహిద్ క‌పూర్ జోక్యం చేసుకోవ‌డంతో కామ్ అయ్యింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం త‌ను ప్ర‌స్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది. తాజాగా షాహీద్ తో దేవాలో న‌టించింది. దీనికి పాజిటివ్ టాక్ వ‌చ్చింది. ఈ సంద‌ర్బంగా చిట్ చాట్ లో స్టార్ హీరోల‌తో న‌టించ‌డం అదృష్టంగా భావిస్తున్నారా అని అడిగిన ప్ర‌శ్న‌కు ఘాటుగా స‌మాధానం ఇచ్చింది ముద్దుగుమ్మ‌.

Pooja Hegde Comment

త‌న‌కు ల‌క్ పై న‌మ్మ‌కం లేద‌ని పేర్కొంది. టాలెంట్ ఉంటే సినిమాల‌లో ఛాన్స్ లు వాటంత‌ట అవే వ‌స్తాయ‌ని అని చెప్పింది. త‌ను త‌మిళం, తెలుగు, హిందీ చిత్రాల‌లో న‌టించాన‌ని, టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్నాన‌ని తెలిపింది.

ప్ర‌స్తుతం త‌నకు ఎక్కువ‌గా హిందీ మూవీస్ లో ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయ‌ని, అందుకే త‌న మ‌కాంను ముంబైకి మార్చేశాన‌ని, తాను ఎక్కువ‌గా వేటి గురించి ఆలోచించ‌న‌ని, పాజిటివ్ దృక్ఫ‌థంతో ఉండేందుకు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని పేర్కొంది.

ఇదే స‌మ‌యంలో స‌ల్మాన్ ఖాన్, హృతిక్ రోష‌న్, అక్ష‌య్ కుమార్ తో పాటు షాహిద్ క‌పూర్ లాంటి న‌టులతో న‌టించ‌డం ఆనందంగా ఉంద‌ని తెలిపింది పూజా హెగ్డే. తాను స‌క్సెస్ ఫెయిల్యూర్ గురించి ప‌ట్టించుకోనంటూ స్ప‌ష్టం చేసింది. అయితే సినిమా ఆడితేనే మ‌న వైపు చూస్తార‌ని లేక పోతే ప‌ల‌క‌రించ‌రంటూ వాపోయింది.

Also Read : World Singer Chandrika Won : భార‌తీయ‌ అమెరిక‌న్ గాయ‌నికి గ్రామీ అవార్డ్

CommentsIndian ActressesPooja HegdeViral
Comments (0)
Add Comment