Pooja Hegde : బాలీవుడ్ బుట్టబొమ్మ, టాలీవుడ్ క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే(Pooja Hegde) సంచలనంగా మారారు. ఆమె ఈ మధ్యనే దేవా మూవీతో ముందుకు వచ్చింది. ఇందులో షాహిద్ కపూర్ తో రెచ్చి పోయి నటించింది. ఆ మధ్యన ఓ స్పెషల్ సాంగ్ చేసి ఆశ్చర్య పోయేలా చేసింది. తాజాగా తమిళ సినీ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ చిత్రంలో నటించనుందని ప్రకటించారు మూవీ మేకర్స్. ఇందులో తను స్పెషల్ సాంగ్ చేస్తుందా లేక కీ పాత్రలో ఉంటుందా అనేది ఇంకా తెలియ లేదు.
Pooja Hegde in Rajinikanth Coolie Movie
ఇప్పటికే తను దళపతి విజయ్ తో జత కట్టింది. తమిళ సినీ ప్రేక్షకులకు తను సుపరిచతమే. ఇక రజనీకాంత్ వెటియాన్ గత ఏడాది విడుదలైంది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. జైలర్ దుమ్ము రేపింది. భారీ కలె క్షన్లు సాధించింది. తాజాగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న కూలీ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మంజు వారియర్ తో కలిసి స్టెప్పులు వేశారు రజనీకాంత్. రోజు రోజుకు ఏజ్ పెరిగినా ఎక్కడా తగ్గడం లేదు . తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డేతో ఎలాంటి స్టెప్పులతో అదరగొడతారనేది చర్చనీయాంశంగా మారింది.
ఇక తాజా చిత్రానికి సంబంధించి మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టైటిల్ , టీజర్ దుమ్ము రేపింది. పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. కూలీ చిత్రంలో కీలక పాత్ర లో నటిస్తున్నారు అక్కినేని నాగార్జున. ఇందులో హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటిస్తున్నట్లు టాక్. తాజాగా పూజా హెగ్డే జాయిన్ అయ్యిందంటూ ప్రకటించారు. దీంతో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.
Also Read : Legendary Singer KJ Yesudas :యేసుదాసు ఆరోగ్యం పదిలం