Pooja Hegde: బీచ్ క్లీనింగ్ లో నిమగ్నమైన పూజా హెగ్డే !

బీచ్ క్లీనింగ్ లో నిమగ్నమైన పూజా హెగ్డే !

Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే చాన్నాళ్ల తర్వాత బయట కనిపించింది. గత కొన్నాళ్లుగా చేసిన సినిమా చేసినట్లు ఫ్లాప్ కావడంతో ఛాన్సులు తగ్గిపోయాయి. ప్రస్తుతానికైతే హిందీలో ఒక్క మూవీ చేస్తుందంతే. అలాంటిది ఇప్పుడు ఓ క్లీనింగ్ ప్రోగ్రామ్‌ లో పాల్గొని తన వంతు బాధ్యత నిర్వర్తించింది. తాజాగా ముంబయిలోని జుహూ బీచ్‌లో శనివారం నిర్వహించిన క్లీనింగ్ ప్రోగ్రామ్‪‌లో పూజా(Pooja Hegde) పాల్గొంది. చెత్త ఎత్తి పర్యావరణ పరిశుభ్రతలో భాగమైంది. సినిమాలు లేకపోవడం వల్ల ఇలా కాస్త ఖాళీగా ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు చిన్న చిన్న ఈవెంట్స్‌లో కనిపిస్తోంది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

Pooja Hegde…

ముంబయి బ్యూటీ పూజా హెగ్డే.. 12 ఏళ్ల క్రితమే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. పలు తెలుగు సినిమాలు ఈమెకు స్టార్ హీరోయిన్ హోదా తీసుకొచ్చాయి. ఎంత వేగంగా సక్సెస్ వచ్చిందో అంతే ఫాస్ట్‌గా మూవీస్ వరసగా ఫెయిలయ్యాయి. దీనితో దక్షిణాది నుంచి ఫేడౌట్ అయిపోయింది. ఇప్పుడు హిందీలో ‘దేవ’ అనే మూవీ చేస్తోంది. ఇది హిట్ కావడం పూజాకి చాలా ముఖ్యం.

Also Read : Anjali: అనవసరంగా బాలయ్య ఇష్యూని పెద్దది చేసారంటున్న అంజలి !

Ala VaikunthapurramulooPooja Hegde
Comments (0)
Add Comment