అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట తమిళ సినిమాలో మెరిసింది. ఆ మూవీ ఆడలేదు. ఆ తర్వాత వరుణ్ తేజ్ తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలతో నటించి మెరిసింది పూజా.
బన్నీతో దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠ పురంలో నటించింది బిగ్ సక్సెస్ . వంశీ తీసిన మహర్షిలో మహేష్ బాబు నటించింది. జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద్ సమేత చిత్రంలో తళుక్కుమంది.
కానీ ఎందుకనో త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా తీస్తున్న గుంటూరు కారం చిత్రంలో అర్ధాంతరంగా తప్పుకుంది. పూజా హెగ్డేకు బదులు లవ్లీ గర్ల్ శ్రీలీల నటిస్తోంది. మొన్నటి దాకా తన కోసం వెయిట్ చేసిన నిర్మాతలు ఉన్నట్టుండి బ్యాకప్ అయ్యారు.
ప్రస్తుతం టాలీవుడ్ , కోలీవుడ్ కంటే బాలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది పూజా హెగ్డే. మొత్తంగా ఈ ముద్దుగుమ్మ గ్లామర్ ను నమ్ముకుంది. సోషల్ మీడియా వేదికగా తను తాజాగా దిగిన ఫోటోలను పంచుకుంది. ఓ హిందీ చిత్రంలో నటించింది. సల్మాన్ ఖాన్ తో మూవీ చేసింది.
మొత్తం మీద ఇప్పుడు టాలీవుడ్ లో ఏ సినిమా చేయాలనే దానిపై ఫోకస్ పెట్టింది పూజా హెగ్డే. ఏది ఏమైనా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటే బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.