Beauty Pooja Hegde :వెబ్ సీరీస్ పై బుట్ట‌బొమ్మ ఫోక‌స్

ఆశించినంత‌గా ఆడ‌ని మూవీస్

Pooja Hegde : ఈ మ‌ధ్య హీరోయిన్లు త‌మ మ‌నసు మార్చుకుంటున్నారు. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకునే ప‌నిలో ప‌డ్డారు. ఇందుకు గాను సినిమాలు, వెబ్ సీరీస్ ల‌లో న‌టించేందుకు సై అంటున్నారు. ఈ కోవ‌లోకి వ‌చ్చి చేరింది బ‌హు భాషా న‌టిగా గుర్తింపు పొందిన ల‌వ్లీ బ్యూటీ పూజా హెగ్డే(Pooja Hegde). త‌ను త‌మిళం, తెలుగు, హిందీ చిత్రాల‌లో త‌ళుక్కున మెరిసింది. అంతే కాదు టాప్ హీరోయిన్ గా సౌతిండియాలో కొన్నాళ్లు కొన‌సాగింది. ప్ర‌స్తుతం బీ టౌన్ లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటోంది.

Pooja Hegde Focus

అల్లు అర్జున్, జూనియ‌ర్ ఎన్టీఆర్, మ‌హేష్ బాబు, డార్లింగ్ ప్ర‌భాస్ , స‌ల్మాన్ ఖాన్ లాంటి దిగ్గ‌జ పాన్ ఇండియా న‌టుల‌తో న‌టించింది పూజా హెగ్డే. అయితే అందాల‌ను ఆర బోసినా, ష‌హీద్ క‌పూర్ తో కిస్సుల‌తో రెచ్చి పోయినా త‌ను తాజాగా న‌టించిన దేవా చిత్రం కూడా బోల్తా ప‌డింది. ఆశించిన మేర ఆద‌ర‌ణ‌కు గురి కాలేదు. దీంతో బుట్ట‌బొమ్మ మ‌నసు మార్చుకున్న‌ట్లు స‌మాచారం.

ప్ర‌స్తుతం బీ టౌన్ లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది పూజా హెగ్డేపై . సినిమాలు ఆడ‌క పోవ‌డంతో వెబ్ సీరీస్ పై క‌న్నేసిందని, ఈ మేర‌కు ఓ సంస్థ‌కు ఓకే కూడా చెప్పింద‌ని టాక్. ప్ర‌స్తుతం సూర్య 44వ చిత్రం రెట్రోలో న‌టిస్తోంది. ద‌ళ‌ప‌తి విజ‌య్ 69 చిత్రంలో కూడా ఓకే చెప్పింది.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే డిమాంటీ కాల‌నీ, కోబ్రా వంటి చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అజ‌య్ జ్ఞాన‌ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న వెబ్ సీరీస్ లో న‌టించ‌నుంది.

Also Read : Hero Nani Record :రౌడీ రికార్డ్ ను బ్రేక్ చేసిన నేచుర‌ల్ స్టార్

Pooja HegdeUpdatesViral
Comments (0)
Add Comment