Ram Gopal Varma : వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు మరోసారి పోలీసుల నుంచి నోటీస్ అందింది. గతంలో జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆయన వ్యూహం అనే సినిమా తీశాడు. ఇందులో సెటైరిక్ గా సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ కు సంబంధించిన ఫోటోలను మార్ఫింగ్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేశారు. స్వయంగా అందజేశారు.
Ram Gopal Varma Got Notices
ఇదే కేసుకు సంబంధించి తనను అరెస్ట్ చేయొద్దంటూ రాం గోపాల్ వర్మ(Ram Gopal Varma) హైకోర్టును ఆశ్రయించారు. తనను ముందస్తు అనుమతి లేకుండా అరెస్ట్ చేసేందుకు వీలు లేదంటూ కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తన తరపు న్యాయవాది బాలు వెల్లడించారు.
ఈ కేసు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో నమోదైన సంగతి విదితమే. ఇంకో వైపు సినిమా పోస్టర్లకు సంబంధించి అనకాపల్లి, తూళ్లూరు పోలీస్ స్టేషన్ లలో దర్శకుడిపై కేసులు నమోదు కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ మధ్యనే తను తీసిన సత్య మూవీపై తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సినిమా రిలీజ్ అయి 25 ఏళ్లయింది.
Also Read : Beauty Aditi Shankar : ‘ప్రేమిస్తావా’ అంటున్న అదితి శంకర్