Ram Gopal Varma : సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ(Ram Gopal Varma) ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. అతని కోసం ఒంగోలు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు ప్రత్యేక పోలీస్ బృందాలను పంపారు. అటు వర్చువల్ విచారణకు అంగీకరించే అవకాశం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ ముందస్తు బెయిల్ కోసం ఆయన తరఫు న్యాయవాది బుధవారం హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై గురువారం విచారణ జరగనుంది. ఈనెల 25న ఒంగోలు పీఎస్‌లో విచారణకు రావాల్సి ఉండగా.. అదే రోజు ఆయన విచారణకు రాకుండా గైర్హాజరయ్యారు. అప్పటి నుంచి పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
Ram Gopal Varma Police Case..
రెండు రోజుల క్రితం రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) ఒక వీడియో విడుదల చేశారు. తానెక్కడికి పారిపోలేదని, పోలీసులు విచారణకు పిలిస్తే తాను వెంటనే విచారణకు రావాలా.. అంటూ ఎదురు ప్రశ్నిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. బుధవారం మరో వీడియో రిలీజ్ చేశారు. అయితే ఆ వీడియోలు ఎక్కడి నుంచి విడుదల చేశారన్న కోణంలో ఐటీ సిబ్బంది విచారిస్తున్నారు. అయితే రాంగోపాల్ వర్మ విచారణకు రాకుండా కోర్టుల నుంచి రక్షణ పొందేందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఒంగోలు పోలీసులు సీరియగా ఉన్నారు. వర్మకు హైకోర్టులో బెయిల్ పిటిషన్ లభిస్తే రాంగోపాల్ వర్మ అప్పుడైనా వెలుగులోకి వస్తారా.. బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ అయితే అజ్ఞాతంలోనే ఉంటారా అన్నది ఉత్కంఠంగా మారింది. రాంగోపాల్ వర్మపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 9 కేసులు నమోదయ్యాయి. ఒంగోలు మద్దిపాడులో నమోదైన కేసులో రాంగోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ గురువారం హైకోర్టులో విచారణకు రానుంది.
తనపై జరుగుతున్న ప్రచారం నిజం కాదంటూ.. పెట్టిన కేసులపై అనుమానాలు ఉన్నాయని.. తనపై పెట్టిన సెక్షన్స్ ఎలా వర్తిస్తాయో అర్దం కావట్లేదంటూ ఆయన వీడియోలో పేర్కొన్నారు. ఏపీ పోలీసుల నోటీసులకు తాను వణికిపోవడం లేదని, మంచం కింద కూర్చొని ఎడవటం లేదని అన్నారు.తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయ్... తాను పోస్టు ఎవరి ఉద్దేశించి పెట్టానో.. వారికి కాకుండా ఇంకెవరో సంబంధం లేని థర్డ్ పార్టీ వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయనేది తనకు అర్ధం కావట్లేదని అన్నారు.
Also Read : Dhanush : ధనుష్ ఐశ్వర్యల కేసులో చెన్నై ఫ్యామిలీ కోర్టు కీలక తీర్పు