Puri Jagannath : డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై పోలీస్ కేసు నమోదు

అయితే ఇది కాస్తా… ఇప్పుడు ఇష్యూగా మారింది...

Puri Jagannath : సోషల్ మీడియాలో పాపులర్ అయిన వ్యక్తుల, సెలబ్రిటీల డైలాగ్స్‌ను పాటల్లో వాడటం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్‌ను పట్టుకునే ప్రయత్నం చేసిన పూరీ జగన్నాద్ చిక్కుల్లో పడ్డారు. తన అప్‌ కమింగ్ సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’ లోని ‘మార్ ముంతా చోడ్ చింతా’ సాంగ్‌లో.. కేసీఆర్ క్యాజువల్ డైలాగ్‌ ‘ఏం చేద్దాం అంటావ్‌ మరి’ అనే లైన్‌ ను వాడారు.

Puri Jagannath Case

అయితే ఇది కాస్తా… ఇప్పుడు ఇష్యూగా మారింది. ఐటెం సాంగ్‌లో బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు.. మాజీ సీఎం కేసీఆర్ డైలాగ్‌ వాడడం.. ఆ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కు అభ్యంతరకం అయింది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కోపం తెప్పించింది. ఈ క్రమంలోనే ఈ పార్టీ కార్యకర్తలైన రజితా రెడ్డి, సతీష్ కుమార్ ఎల్బీనగర్ డీసీపీకి పూరీ జగన్నాద్ పై కంప్లైట్ చేశారు. ఆయనపై యాక్షన్ తీసుకోవాలని రెక్వెస్ట్ చేశారు.

Also Read : Kartik Aaryan : సినిమాల మీద ఉన్న ఇష్టంతో నా ప్రేమను దూరం చేసుకున్న

Police Casepuri jagannadhUpdatesViral
Comments (0)
Add Comment