Rakshit Shetty : కన్నడ నటుడు రక్షిత్ శెట్టి పై పోలీస్ కేసు

దిగంత్‌, అచ్యుత్‌కుమార్‌, యోగేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్యాచిలర్‌ పార్టీ’...

Rakshit Shetty : కన్నడ నటుడు, నిర్మాత రక్షిత్‌శెట్టిపై కేసు నమోదైంది. తమ సంస్థకు చెందిన పాటలు కాపీ కొట్టారని పేర్కొంటూ ఎంఆర్‌టీ మ్యూజిక్‌ కంపెనీ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘ న్యాయ ఎల్లిదే’, ‘గాలిమాతు’ చిత్రాల్లోని పాటలను రక్షిత్‌, ఆయనకు చెందిన నిర్మాణసంస్థ పరంవా స్టూడియోస్‌ ‘బ్యాచిలర్‌ పార్టీ’లో కాపీ కొట్టారని తెలియజేసింది. తమ అనుమతి లేకుండా ఇలా చేయడం ఏమాత్రం సరికాదని పేర్కొంది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయంపై స్పందించమని కోరుతూ రక్షిత్‌కు నోటీసులు జారీ చేశారు.

Rakshit Shetty..

దిగంత్‌, అచ్యుత్‌కుమార్‌, యోగేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్యాచిలర్‌ పార్టీ’. రక్షిత్‌ శెట్టి నిర్మించారు. జనవరిలో విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన కు పరిమితమైంది. ప్రస్తుతం ఇది అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా అందుబాటులో ఉంది. ఆ పాటలకు సంబంధించిన హక్కుల విషయమై గతంలో ఎంఆర్‌టీ స్టూడియోస్‌, రక్షిత్‌ శెట్టి సమావేశమైనప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని శాండల్‌వుడ్‌లో టాక్‌.

Also Read : Rakul Preet Singh : డ్రగ్స్ కేసులో నటి రకుల్ సోదరుడు పోలీసుల అదుపులో

BreakingKannadaNew HeroUpdatesViral
Comments (0)
Add Comment