PM Modi : భారత దేశం గర్వించ దగిన మహోన్నత సంగీత శిఖరం ఇళయరాజా అని ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కేంద్ర ప్రభుత్వం ఆయనకు అరుదైన గౌరవాన్ని కల్పించింది. ఎవరూ ఊహించని రీతిలో తనకు అత్యున్నతమైన రాజ్యసభ సభ్యుడి పదవిని కట్టబెట్టింది. సంగీత రంగానికి ఇళయారాజా చేసిన విశిష్ట సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఆవరణలో స్వయంగా పీఎం ఇళయరాజాను కలుసుకున్నారు.
PM Modi Praises Illayaraja
తనను కలుసు కోవడం జీవితంలో మరిచి పోలేనని అన్నారు మోదీ. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం లండన్‌లో తన తొలి పాశ్చాత్య శాస్త్రీయ సింఫనీ వాలియంట్ ను ప్రదర్శించడం ద్వారా ఇళయరాజా చరిత్ర సృష్టించారు. అందుకే తనను కలుసుకుని అభినందించడం జరిగిందని తెలిపారు పీఎం తన ఎక్స్ వేదికగా.
అపారమైన పాండిత్యం, అద్భుతమైన సంగీత జ్ఞానం, అంతకు మించిన వినయం , విధేయత తనను ఎంతగానో ఆకట్టుకునేలా చేసిందన్నారు నరేంద్ర మోదీ. అత్యంత ప్రతిభావంతుడైన ఈ సంగీత దిగ్గజం ఈ సమున్నత భారత దేశానికి గర్వ కారణంగా నిలుస్తారని చెప్పడంలో అతిశ యోక్తి లేదన్నారు. రాబోయే రోజుల్లో ఇళయరాజా మరిన్ని అద్బుతమైన సంగీత కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు మోదీ.
Also Read : ED Case Shocking Youtubers : యూట్యూటర్స్ వ్యవహారంపై ఈడీ ఫోకస్